ఇద్దరూ నరేంద్రులే.. ఇద్దరిదీ ఒకే మాట..

ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మోదీకి ఉంది. మోదీ ప్రసంగం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ ప్రసంగం అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో మోదీ ప్రసంగించినా ప్రవాస భారతీయులతో పాటు.. అక్కడి వారు సైతం ఆసక్తి చూపుతారు. ఇక తాజాగా అమెరికాలో జరిగిన హౌదీ-మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగం అదిరిపోయింది. అయితే […]

ఇద్దరూ నరేంద్రులే.. ఇద్దరిదీ ఒకే మాట..
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 9:16 AM

ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మోదీకి ఉంది. మోదీ ప్రసంగం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోదీ ప్రసంగం అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో మోదీ ప్రసంగించినా ప్రవాస భారతీయులతో పాటు.. అక్కడి వారు సైతం ఆసక్తి చూపుతారు.

ఇక తాజాగా అమెరికాలో జరిగిన హౌదీ-మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగం అదిరిపోయింది. అయితే సరిగ్గా ఇలాగే 124 సంవత్సరాల కిందట భారత్ నుంచి నరేంద్రనాథ్ దత్ అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో మాట్లాడారు. అక్కడ ఆయన పలికిన తొలి పలుకుతోనే ఆ మహా సమ్మేళనానికి వచ్చిన వేలాది జనం లేచి నిలబడి సుమారు 10 నిమిషాలు చప్పట్లు కొట్టారు. సోదరభావాన్ని చాటుతూ ప్రియమైన సోదర, సోదరీమణులారా అంటూ ఆయన పలికిన తొలి మాటలతోనే భారతదేశ గొప్పతనం ప్రపంచ దేశాలకు పాకింది.

ఇంతకీ ఆ నరేంద్రనాథ్ ఎవరు అనుకుంటున్నారు.. మన వివేకానందుడే. జనవరి 12, 1863లో కలకత్తాలో ఆయన జన్మించారు. చిన్నప్పటినుంచి వివిధ మత సిద్ధాంతాలను అలవాటు చేసుకున్న వివేకానందుడు(నరేంద్రనాథ్) కొంతకాలం బ్రహ్మసమాజంలో గడిపాడు. రామకృష్ణ పరమహంస మరణానంతరం సన్యాసం స్వీకరించి వివేకానందుగా మారాడు. హిమాలయాలకు వెళ్ళి ఆరేళ్ళపాటు ధ్యానంలో గడిపాడు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందూమత ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ తరువాత ఇంగ్లాండ్‌, శ్రీలంక, స్టిట్జర్లాండ్‌ మొదలైన దేశాలు పర్యటించి తన ప్రసంగంతో అందరిని ఆకట్టుకున్నారు. తరువాత రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్థాపించారు. కలకత్తా సమీపంలోని బేలూరులో జులై 4, 1902వ సంవత్సరంలో నరంద్రనాథ్ దత్ మరణించారు.

అంతటి మహానుభావుడిని మళ్లీ తన ప్రసంగంతో ఈ నాటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. మతాలు వేరైనా ఇద్దరి పేర్లూ ఒక్కటే. అయితే అప్పుడు వివేకానందుడి ప్రసంగానికి ప్రపంచమంతా ఊర్రూతలూగింది. ఇక ఇప్పుడు మోదీ ప్రసంగానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ప్రశంసలు దక్కాయి. కాగా, ఇప్పటివరకూ ఏ దేశానికి సంబంధించిన నేత అయినా అమెరికాలో సభ నిర్వహిస్తే ఇంతటి ఖ్యాతి రాలేదు. తొలిసారి మోదీ అలాంటి రికార్డు స్థాపించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు