పానిపట్: సంజయ్ దత్‌కు మాజీ ఆఫ్గన్‌ రాయబారి వార్నింగ్!

ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో చారిత్రక సినిమాలు వచ్చాయి. అవి విడుదల అవడానికి ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో చారిత్రక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘పానిపట్’. 1761 జనవరి 14న అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన మూడో యుద్ధమే పానిపట్. పానిపట్ యుద్ధమే ముఖ్య భూమికగా సినిమాను తెరకెక్కించారు అషుతోష్ గోవారికర్. ఇందులో మరాఠా వీరుడు సదాశివరావు పాత్రలో […]

పానిపట్: సంజయ్ దత్‌కు మాజీ ఆఫ్గన్‌ రాయబారి వార్నింగ్!
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2019 | 6:06 PM

ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో చారిత్రక సినిమాలు వచ్చాయి. అవి విడుదల అవడానికి ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో చారిత్రక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘పానిపట్’. 1761 జనవరి 14న అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన మూడో యుద్ధమే పానిపట్.

పానిపట్ యుద్ధమే ముఖ్య భూమికగా సినిమాను తెరకెక్కించారు అషుతోష్ గోవారికర్. ఇందులో మరాఠా వీరుడు సదాశివరావు పాత్రలో అర్హున్ కపూర్, అఫ్గానిస్థాన్ రాజు అబ్దాలీ పాత్రలో సంజయ్ దత్ నటించారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌ కాస్త బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాల్లాగే ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ ట్రైలర్‌ను అఫ్గానిస్థాన్‌లో భారత్‌కు రాయబారిగా పనిచేసిన షైదా అబ్దాలీ వీక్షించారు. ట్రైలర్ చూశాక ఇండియా, అఫ్గాన్‌కు మధ్య ఏమన్నా గొడవలు జరుగుతాయేమోనని భయపడిన షైదా ఇందులో కింగ్ అబ్దాలీ పాత్రలో నటించిన సంజయ్ దత్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘డియర్ సంజయ్ దత్.. చరిత్ర పరంగా చూసుకుంటే భారతీయ సినిమాల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను స్ట్రాంగ్‌గా ఉంచుతోంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పానిపట్ సినిమాను తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నాను’ అని కాస్త సాఫ్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు.

హుస్సేన్ దలాల్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కృతిసనన్ సదాశివరావు భార్య పార్వతీ బాయ్ పాత్రలో నటించారు. పానిపట్ యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగింది. అబ్దాలీ మరాఠా వీరులను ఓడించి దాదాపు 40వేల మందిని ఊచకోత కోశాడు. భారతదేశ చరిత్రలోనే ఈ యుద్ధం చాలా భయంకరమైనది. డిసెంబర్ 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.