తాలిబన్ల చెరనుంచి ఆ ముగ్గురి విడుదలకు రూట్ క్లియర్..!

తాలిబన్ల చెరలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్ల విడుదలకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర పాటుగా వీరు ఆఫ్ఘన్‌ తాలిబన్ల ఆధీనంలో ఉన్నారు. అయితే ఆదివారం తాలిబన్లకు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చల్లో భారత ఇంజనీర్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురి ఇంజనీర్ల కోసం తాలిబన్లు అమెరికా బలగాల ముందు 11 మంది తాలిబన్లను విడుదల చేయాలని షరతులు పెట్టినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అయితే తాలిబన్ల షరతులకు […]

తాలిబన్ల చెరనుంచి ఆ ముగ్గురి విడుదలకు రూట్ క్లియర్..!
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 4:42 PM

తాలిబన్ల చెరలో ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్ల విడుదలకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర పాటుగా వీరు ఆఫ్ఘన్‌ తాలిబన్ల ఆధీనంలో ఉన్నారు. అయితే ఆదివారం తాలిబన్లకు, అమెరికా బలగాల మధ్య జరిగిన చర్చల్లో భారత ఇంజనీర్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురి ఇంజనీర్ల కోసం తాలిబన్లు అమెరికా బలగాల ముందు 11 మంది తాలిబన్లను విడుదల చేయాలని షరతులు పెట్టినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అయితే తాలిబన్ల షరతులకు అమెరికా బలగాలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు ఇంజనీర్ల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే దీనిపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు ఇటు భారత ప్రభుత్వానికి సైతం దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తర బంఘ్లాన్‌ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న భారత ఇంజినీర్లను తాలిబన్లు మే 2018లో అపహరించారు. అందులో ఒకరిని గత మార్చిలో విడిచిపెట్టారు. అయితే మరోముగ్గుర్ని మాత్రం వారి వద్దే బందీగా ఉంచుకున్నారు. తాజాగా వీరిని కూడా విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన మరో ఇద్దరిని కూడా విడిచిపెట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే అమెరికా విడుదల చేయబోతున్న వారిలో తాలిబన్ ముఖ్య నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!