దొంగలను తరిమికొట్టిన ధైర్యానికి “సాహస’ పురస్కారం

తమిళనాడు వృద్ధ దంపతుల సాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబచ్చన్‌, ప్రముఖ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌ వారిని అభినందించారు. తాజాగా ఆ రాష్ట్రం ప్రభుత్వం వారి సాహసానికి తగిన గుర్తింపును అందజేసింది. తిరునల్వేలి జిల్లా కళ్యాణిపురంలో షణ్ముగవేల్‌, సెంతామరై వృద్ధ దంపతులు ఇంటి బయట కూర్చొని ఉండగా ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి కత్తులతో దాడి చేశారు. షణ్ముగం మెడకు టవలు చుట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంతలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన […]

దొంగలను తరిమికొట్టిన ధైర్యానికి సాహస' పురస్కారం
Follow us

|

Updated on: Aug 15, 2019 | 8:28 PM

తమిళనాడు వృద్ధ దంపతుల సాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబచ్చన్‌, ప్రముఖ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌ వారిని అభినందించారు. తాజాగా ఆ రాష్ట్రం ప్రభుత్వం వారి సాహసానికి తగిన గుర్తింపును అందజేసింది. తిరునల్వేలి జిల్లా కళ్యాణిపురంలో షణ్ముగవేల్‌, సెంతామరై వృద్ధ దంపతులు ఇంటి బయట కూర్చొని ఉండగా ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి కత్తులతో దాడి చేశారు. షణ్ముగం మెడకు టవలు చుట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంతలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆయన భార్య వారిపై కుర్చీలు విసురుతూ ఎదురుదాడికి దిగింది. ఆ వృద్ధ దంపతులిద్దరూ ఏ మాత్రం భయపడకుండా చేతికి  ఏది దొరికితే దానితో దొంగలను ప్రతిఘటించారు. చివరకు వృద్ధుల దాటికి దొంగలు పరారయ్యారు. ఆ ఘటన మొత్తం ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీలలో రికార్డ్‌ కాగా దాని ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టడంతో..ఆ వృద్ధ దంపతుల సాహసానికి అందరూ దాసోహమయ్యారు. తాజాగా ఆ దంపతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాహస పురస్కారం అందజేసింది. వేడుకలలో భాగంగా దంపతులకు తమిళనాడు సీఎం సాహాస పురస్కారం అందజేశారు.