చిట్టి ఆవాలు చేసే మేలు తెలిస్తే…

Health Benefits of Mustard, చిట్టి ఆవాలు చేసే మేలు తెలిస్తే…

ఆవాలు లేని వంటిళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు..కూరలకు తాళింపు పెట్టేటప్పుడు పోపు దినుసుగా ఆవాలను ప్రతీ ఇంట్లోనూ వాడుతారు. చూసేందుకు చిన్నవిగా కనిపించే ఆవాలలో దివ్యమైన ఔషధ గుణం ఉంది.
– ఆవాల్లో ఐరిన్‌, జింక్‌, మాంగనీస్‌, కాల్షియం ఉంటాయి. స్త్రీలలో నెలసరి సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి.
– ఎముకులకు బలం చేకూరడానికి ఆవాలు సహకరిస్తాయి.
– ఆవనూనె కొవ్వును కరిగిస్తుంది. శరీరం మర్దనా చేసేందుకు ఆవ నూనెను వినియోగిస్తారు.
– పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు దివ్య ఔషధం. గోరు వెచ్చని నీటిలో చెంచాడు ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
– శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలపై రాయడం ద్వారా అవి తగ్గిపోతాయి.
– ఆవ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
– కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
– ఆవాల ముద్దను, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
– చర్మంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి కూడా ఆవ పొడి బాగా పనిచేస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *