ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Eating Dates is Good for Health, ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

ఎండారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇంకా చెప్పాలంటే..ఏ పండయినా పండుగానే బాగుంటుంది..కానీ, ఖర్జూరం పండినా, ఎండినా బాగుంటుంది. మరీ ముఖ్యంగా శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ముందు వరుసలో నిలిచేవి ఖర్జూరాలే. ఇందులోని పోషక పదార్థాలు, ఔషద గుణాలు ..మన శరీరానికి, మెదడుకూ కూడా ఎంతో మేలుచేస్తాయి. డేట్స్‌లో ఉండే విటమిన్‌ ఎ.బి.లతో పాటు కాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఖర్జూరాన్ని “ప్రోటీన్స్‌ పవర్‌ హౌస్‌’ అని కూడా పిలుస్తుంటారు. అటువంటి ఖర్జూరాలను రోజుకూ మూడు చొప్పున తీసుకున్నట్లయితే అద్భుత ఫలితం ఉంటుంది.

* ఐరన్‌ అధికంగా ఉన్న ఖర్జూరాలను తీసుకోవడం వల్ల అనీమియా సమస్య దూరమవుతుంది.
* జియాక్సిథిన్‌, టూటిన్స్‌ అధికంగా ఉండి..కళ్ల సమస్యలకు చక్కటి పరిష్కరం కలిగిస్తుంది.
* ఎండు ఖర్జూరాలను నానబెట్టి పరగడపున తినడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు
* జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పూట 2,3 ఖర్జూరాలు తింటే ఫలితం ఉంటుంది.
* ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి.
* జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు ఖర్జూరాలను నీటిలో వేసి మరిగించి నల్లమిరియాల పొడి, యాలకుల పొడి వేసి మరిగించి ..రాత్రిపూట ఈ నీటిని తాగితే సమస్యలన్నీ

పరిష్కారమవుతాయి.
* బాలింతలు వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడతాయి.
* డేట్స్‌లో హెల్తీ న్యూట్రీషియన్స్‌ ఉండటం వల్ల స్వీట్స్‌ తిన్న ఫీలింగ్‌తో పాటు బరువును కూడా తగ్గిస్తుంది.
* పరగడుపున డేట్స్‌ తినడం వల్ల షుగర్‌ లవల్స్‌ కూడా బ్యాలెన్స్‌ అవుతాయట.
* పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల స్ర్టోక్‌ రాకుండా నివారిస్తుంది.
* డేట్స్‌లోని ఫాస్పరస్‌ బ్రెయిన్‌ ఫంక్షన్‌కు చాలా మేలుస్తుంది. దీంతో మెదడుకు కావాల్సిన న్యూట్రీషియన్స్‌ అందివ్వడంలో డేట్స్‌ దోహదపడతాయి.
* ఎండు ఖర్జూరాల్లో ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, సుక్రోజ్‌ అనే కంటెంట్స్‌ ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *