ఇకపై వాట్సాప్‌లోనూ యాడ్స్? ‘మోత’కు పడదా ఫుల్‌స్టాప్!

ఈ రోజుల్లో వాట్సాప్‌ వాడని వారుండరు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతీ ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. ఇక ఆఫోన్‌లో ముఖ్యంగా వాట్సాప్ తప్పక ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ వీడియో కాలింగ్స్ ఎక్కువ అయ్యాయి కూడా. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారిని కలవడానికి వాట్సాప్ బాగా ఉపయోగపడుతుంది. కాగా.. అనతి కాలంలోనే వాట్సాప్‌లో బోలెడన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో మరో ఫీచర్ వాట్సాప్‌లోకి రానుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే.. ఇప్పుడు […]

ఇకపై వాట్సాప్‌లోనూ యాడ్స్? 'మోత'కు పడదా ఫుల్‌స్టాప్!
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 6:41 PM

ఈ రోజుల్లో వాట్సాప్‌ వాడని వారుండరు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతీ ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తోంది. ఇక ఆఫోన్‌లో ముఖ్యంగా వాట్సాప్ తప్పక ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ వీడియో కాలింగ్స్ ఎక్కువ అయ్యాయి కూడా. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారిని కలవడానికి వాట్సాప్ బాగా ఉపయోగపడుతుంది. కాగా.. అనతి కాలంలోనే వాట్సాప్‌లో బోలెడన్ని ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో మరో ఫీచర్ వాట్సాప్‌లోకి రానుంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే.. ఇప్పుడు వాట్సాప్‌లో కూడా యూజర్లకు యాడ్స్ కనిపించనున్నాయి. ఇక నుంచి వాట్సాప్‌లో కూడా ఈ యాడ్స్ డిస్‌ ప్లే అవనున్నాయని.. ఈ సంస్థ ఇదివరకే తెలియజేసింది. కాకపోతే ఈ యాడ్స్ ఫీచర్ ఎప్పుడు విడుదల అవుతుందనేది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. గత కొద్ది రోజుల నుంచి ఈ వార్త ఫుల్‌గా ట్రోల్ అవుతోంది. అయితే.. వాట్సాప్‌‌లో యాడ్స్ ఎలా వస్తాయని మీరు ఆలోచించవచ్చు. సపోజ్ స్టేటస్‌లు చూస్తున్నప్పుడు, లేదా కాల్స్ చేసేటప్పుడు కానీ యాడ్స్ రావచ్చని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. వాట్సాప్‌లో యాడ్స్ వస్తున్నాయని సంస్థ చెప్పడంతో.. నెటిజన్లు కాస్త చిరాకును వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అవి విధులకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని యాడ్స్ అయితే.. దానికి ఇచ్చిన సమయం పూర్తి అయ్యేంతవరకూ అది క్లోజ్ అవదు. ఇలాంటివి మనం యూట్యూబ్స్‌లో, సోషల్ మీడియా యాప్స్‌లో మనం చూస్తూనే ఉన్నాం.