మర్డర్.. మిస్సింగ్.. సస్పెన్స్.. అవినీతి పోలీస్.. ‘ఎవరు’ ట్రైలర్ టాక్

Evaru Trailer, మర్డర్.. మిస్సింగ్.. సస్పెన్స్.. అవినీతి పోలీస్.. ‘ఎవరు’ ట్రైలర్ టాక్

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటోన్న యంగ్ హీరో అడవి శేషు నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్ విడుదలైంది. మిస్టరీ కథతో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది.

ట్రైలర్ విషయానికొస్తే.. హీరోయిన్ రెజీనా అత్యాచారానికి గురి కాగా.. ఆ నిందితుడిని హత్య చేసినట్లుగా మొదలవుతుంది. ఆ తరువాత అవినీతి పోలీస్‌గా అడివి శేషు ఎంట్రీ ఇవ్వడం.. రెజీనా కేసును అతడికే అప్పగించడం.. ఆమెను కలిసి విచారించడం.. ఈ మధ్యలో మరో మిస్సింగ్ కేసు రావడం ఇలా ట్రైలర్ మొత్తం ఇంట్రస్టింగ్‌గా సాగింది. దానికి తోడు శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌కు మెయిన్ అస్సెట్‌గా నిలిచింది.

ఇక ఈ చిత్రంలో అడివి శేషు, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ కృష్ణలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వం వహించాడు. ఇదివరకు వచ్చిన టీజర్, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *