టీజర్ టాక్: మర్డర్ మిస్టరీ.. దాగి ఉన్న అసలు నిజాలేంటి?

యంగ్ హీరో అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’. పీవీపీ బ్యానర్‌పై పరం.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజయ్యింది.

ట్రైలర్ విషయానికి వస్తే.. రెజీనా.. తన మీద రేప్ ఎటెంప్ట్ చేయబోయిన ఓ వ్యక్తిని షూట్ చేసి చంపేస్తుంది. అయితే ఈ మర్డర్ వెనక అసలు నిజాలను బయటపెట్టేందుకు తమిళనాడు పోలీస్ అధికారిగా అడివి శేష్ రంగ ప్రవేశం చేస్తాడు. అసలు హంతకుడు ఎవరు.? ఆ మర్డర్ వెనక ఏమి జరిగిందనేది తెరపై చూడాల్సిందే.

పోలీస్ ఆఫీసర్ విక్రమ్ వాసుదేవన్‌గా అడివి శేష్ లుక్ ప్రామిసింగ్‌గా ఉంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. దాదాపు నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంది. నవీన్ చంద్ర, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *