జీవికే నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ టేకోవర్ చేసిన అదానీ గ్రూప్

ఎట్టకేలకు ముంబై ఎయిర్ పోర్టులో అదానీ గ్రూప్ ల్యాండ్ అయింది. ముంబై ఎయిర్ పోర్టు, నవీ ముంబై ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ కంట్రోల్ ను అదానీ గ్రూప్ టేకోవర్ చేస్తున్నట్టు జీవీకే పవర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సోమవారం ప్రకటించింది.

జీవికే నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ టేకోవర్ చేసిన అదానీ గ్రూప్
Follow us

|

Updated on: Sep 01, 2020 | 3:43 PM

ఎట్టకేలకు ముంబై ఎయిర్ పోర్టులో అదానీ గ్రూప్ ల్యాండ్ అయింది. ముంబై ఎయిర్ పోర్టు, నవీ ముంబై ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ కంట్రోల్ ను అదానీ గ్రూప్ టేకోవర్ చేస్తున్నట్టు జీవీకే పవర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సోమవారం ప్రకటించింది. ముంబై ఎయిర్ పోర్టు, నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులో 74 శాతం చొప్పున వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిపింది. లెండర్ల నుంచి ఒత్తిడి, కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవీకే ఫౌండర్ జీవీ కృష్ణారెడ్డి తెలిపారు. అప్పుల భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న జీవీకే గ్రూప్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ వదులుకోవాలని భావించింది. సుమారు రూ.705 కోట్లు దారి మళ్లాయనే ఆరోపణలతో జీవీకే గ్రూప్ పై సీబీఐ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

గోల్డ్ మ్యాన్ శాచ్స్ కన్సార్షియం, హెచ్ డిఎఫ్ సి వంటి లెండర్ల నుంచి జీవీకే తీసుకున్న అప్పుల బాధ్యత కూడా ఈ కొనుగోలులో భాగంగా అదానీ నెత్తినే పడుతుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుని మొత్తం వాటాలను జీవీకే గ్రూప్ హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్, యెస్ బ్యాంక్ వద్ద తనాఖా పెట్టింది. వాటాలు తనాఖా పెట్టి బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులను క్లియర్ చేసేందుకు జీవీకే గ్రూపునకు ఈ డీల్ సహకరించనుంది. జీవీకే గ్రూప్ అప్పులు సుమారు రూ.6 వేల కోట్లుగా ఉన్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చెందిన డెట్ ఇన్స్ట్రుమెంట్ల రేటింగ్ ను రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇటీవలే డౌన్ గ్రేడ్ చేసింది. ఈ డీల్ లో భాగంగా డెట్ కు బదులుగా జీవీకే ఇచ్చిన పలు ఆబ్లిగేషన్స్, సెక్యూరిటీలు, కార్పొరేట్ గ్యారెంటీలు అన్ని కూడా ఇరు వర్గాల ఆమోదం మేరకు నిబంధనల ప్రకారం విడుదల చేయనున్నారు.

అదానీ గ్రూప్ ఎప్పటి నుంచో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎంఐఏల్ లో పాగా వేయాలని చూస్తోంది. జీవీకేను కష్టాలు వెంటాడుతుండడంతో ఇదే అదునుగా దూరిపోయింది. ఎంఐఏల్ కన్సార్షియంలోకి తాజాగా ఫండ్స్ ను చొప్పించనుంది. నవీ ముంబై ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కు ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ ఇవ్వనుంది. అయితే ఎంత మొత్తాన్ని ఇవ్వనుందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కరోనా కారణంతో ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా కుదేలైంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఆర్థికంగా చితికిపోయింది. ఎంఐఏఎల్ ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు వీలైనంత తక్కువ టైమ్ లో ఆర్థికంగా బలంగా ఉన్న ఇన్వెస్టర్ను తీసుకురావాల్సి ఉందని జీవీకే గ్రూప్ ఛైర్మన్ జీవీకే రెడ్డి చెప్పారు. అదేవిధంగా నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ను గడువు లోపల పూర్తి చేసేందుకు కూడా ఈ డీల్ సాయపడనుందని పేర్కొన్నారు.

పోర్ట్ ల నుంచి ఎయిర్ పోర్ట్ వరకు అదానీ గ్రూప్ మెల్లమెల్లగా విస్తరించింది. లక్నో, జైపూర్, గౌహతి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరులో ఎయిర్ పోర్ట్ అథారిటీ నిర్మించిన 6 నాన్ మెట్రో ఎయిర్ పోర్ట్ ల మెయింటనెన్స్ కాంట్రాక్టులను అదానీ గ్రూప్ ఇటీవల దక్కించుకుంది. ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్ట్ నుకూడా దక్కించుకోవడంతో, జీఎంఆర్ తర్వాత ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ గా అదానీ గ్రూప్ నిలువనుంది.

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్