Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

Ramya Nambeesan:దర్శకురాలిగా మారిన నటి.. అందరినీ ఏకిపారేసిందిగా..!

Actress turns director, Ramya Nambeesan:దర్శకురాలిగా మారిన నటి.. అందరినీ ఏకిపారేసిందిగా..!

రమ్యా నంబీషన్.. ఈ పేరు చెప్పగానే టాలీవుడ్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేయకపోవచ్చు. కానీ పిజ్జా సినిమా చూసిన వారు ఈ అమ్మడును కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఈ భామ ఇక్కడ పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అయితే తమిళం, మలయాళంలో మాత్రం రమ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే రమ్య నంబీషన్ ఎన్‌కోర్ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రారంభించిన ఈ హీరోయిన్.. తాజాగా మరో అవతారమెత్తింది. దర్శకురాలిగా తన ప్రతిభను బయటపెట్టింది రమ్య.

‘అన్‌ హైడ్’ పేరుతో రమ్య తీసిన షార్ట్ ఫిలిం తాజాగా విడుదలైంది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ షార్ట్ ఫిలింలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించడంతో పాటు.. పురుషులు ఎలా ఉండాలో కూడా వివరించింది. ఇక ఈ లఘు చిత్రానికి భద్రీ వెంకటేష్ డైలాగ్‌లు రాయగా.. రమ్య సోదరుడు రాహుల్ సుబ్రమణ్యం సంగీతం అందించారు. ఈ షార్ట్‌ ఫిలింలో రమ్య, శ్రిత శివదాస్ నటించారు. ప్రస్తుతం ఈ లఘు చిత్రంలో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుండగా.. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అర్థవంతంగా, అద్భుతంగా.. రమ్య ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించిందని నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి అన్ హైడ్‌తో తనలో ఇన్నిరోజులు హైడ్ అయి ఉన్న టాలెంట్‌ను బయటపెట్టేసింది రమ్య. ఇక ఈ లఘు చిత్రం ఇచ్చిన ఊపుతో రమ్య భవిష్యత్‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కించినా ఆశ్చర్యపోవక్కర్లేదని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Related Tags