‘నెపోటిజం’పై తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత బంధు ప్రీతి గురించి బాలీవుడ్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయలను బయట పెడుతున్నారు. తాజాగా ఇదే ప్రశ్న మిల్కీ బ్యూటీ తమన్నాకు..

'నెపోటిజం'పై తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 5:36 PM

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత బంధు ప్రీతి గురించి బాలీవుడ్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయలను బయట పెడుతున్నారు. తాజాగా ఇదే ప్రశ్న మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఎదురైంది. తాజాగా ఓ ఇంగ్లీషు పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన తమన్నా.. నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. బహుశా నేనూ డాక్టర్‌ని అయి ఉంటే నాకు వాళ్లు గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్లు. కానీ నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఒకవేళ ఫ్యూచర్‌లో నా పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తానంటే నేను వాళ్లకు మద్దతుగా ఉంటాను. అందులో తప్పేమీ లేదు. నేను సినీ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చాను. ముంబై అమ్మాయిని. మొదట నేను తమిళ, తెలుగు సినిమాలు చేసేటప్పుడు నాకు భాష తెలియదు. అక్కడి వారెవరూ నాకు పరిచయం లేదు. అయినా నాకు అక్కడి నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. నా కష్టాన్ని, ప్రతిభను చూసి వారు నాకు అవకాశాలు ఇచ్చారు. నేను వాటిని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నా.

ఇక నా విజయాలకు, పరాజయాలకు విధిరాతే కారణమని నేను నమ్ముతా. బంధుప్రీతి, రాజకీయలు అనేవి ప్రతీ రంగంలోనూ కామన్‌గా ఉంటాయి. అవి ఒకరికి సక్సెస్‌ లేదా ఓటమి నిర్ధేశించలేవని నా అభిప్రాయం అని తెలిపింది తమన్నా.

Read More:

సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండండి: నవ్య స్వామి

27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి మట్టితో..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..