సీరియల్స్‌లో అవకాశాలు లేక.. చివరికి ఇలా..

Actress strangles teen daughter, hangs self in Thane

కుమార్తెను చంపేసి తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది ఓ టీవీ నటి. ఈ విషాదకర ఘటన ముంబైలోని థానేలో జరిగింది. మరాఠీ సీరీయల్స్‌లో నటిగా మంచి గుర్తింపు ఉన్న ప్రాద్య్నా పర్కార్ (40) అనే మహిళకు ఇటీవల కాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైంది. ప్రాద్య్నా భర్త చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వీరికి ఇంటర్ విద్యనభ్యసిస్తున్న శ్రుతి అనే కుమార్తె ఉంది. తనకు సీరియల్స్‌లో అవకాశాలు రాక, భర్త వ్యాపారం నష్టాల బాట పట్టడంతో ఏం చేయాలో అర్ధంకాక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

శుక్రవారం ఉదయం భర్త జిమ్‌కు వెళ్లిన సమయంలో ప్రాద్య్నా తన కుమార్తె శ్రుతి గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తీరా భర్త ఇంటికొచ్చి చూసే సరికి ఇద్దరూ మృతి చెంది ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లికూతుళ్ల మరణంతో ఆప్రాంతంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. మరోవైపు ప్రాద్య్నా రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *