అలా అవుతుందనుకుంటే.. ఇలా అయ్యింది: రేణుదేశాయ్

తన సినీ జీవితానికి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా నటి రేణు దేశాయ్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అస్సలు తాను నటిని కావాలని కోరుకోలేదని అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నది తన డ్రీమ్ అని చెప్పారు రేణు...

అలా అవుతుందనుకుంటే.. ఇలా అయ్యింది: రేణుదేశాయ్
Follow us

|

Updated on: Sep 10, 2020 | 9:43 PM

తన సినీ జీవితానికి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా నటి రేణు దేశాయ్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అస్సలు తాను నటిని కావాలని కోరుకోలేదని అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నది తన డ్రీమ్ అని చెప్పారు రేణు. అదికాకుంటే డాక్టర్ కావాలనుకున్నానని చెప్పింది. అయితే విధి మాత్రం తనను కెమెరా ముందుకు తీసుకొచ్చిందని తెలిపింది. నాసాలో చేరాలనుకున్న తాను.. అలా జరగకపోయే సరికి చాలా బాధ పడ్డానని చెప్పింది. అది తనను కొన్నేళ్ల పాటు వెంటాడిందని తెలిపింది. 16 ఏళ్ల వయసులో తాను ఏమీ తెలియకుండానే కెమెరా ముందుకు వచ్చానని.. ఆ తర్వాత సినిమాలతో ప్రేమలో పడిపోయానని చెప్పింది రేణుదేశాయ్. ఇక, సినీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత తన జీవితంలో జరిగిన అన్ని విషయాలు మీకు తెలుసంటూ ఆమె తన అనుభవాలను, వ్యక్తిగత అంశాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.