Breaking News
  • సరూర్ నగర్ చెరువు లో కొట్టుకు పోయిన నవీన్ కుమార్ మృత దేహానికి నేడు పోస్ట్ మార్టం. ఆదివారం సాయంత్రం నాల లో కొట్టుకుపోయి సరూర్ నగర్ చెరువు లో నిన్న మధ్యాహ్నం తేలిన నవీన్ మృత దేహం. కొట్టుకు పోయిన స్థలం నుండి 100 మీటర్ల దూరం లో లభ్యమైన నవీన్ మృత దేహం. 8 అడుగుల లోతు లో బురదలో ఇర్రుకున్న నవీన్ మృత దేహం. ఈ రెండు ఘటనల పై ప్రభుత్వం సీరియస్. నగరం లో ఓపెన్ నాలా లను క్లోజ్ చేసిన జిహెచ్ఎంసి అధికారులు. నేరేడ్మెంట్ లో మునిసిపల్ మంత్రి కే టి ఆర్ సహా అదికరుల పై ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. సరూర్ నగర్ లో చనిపోయిన నవీన్ కుమార్ భార్య కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చిన సబితా ఇంద్రా రెడ్డి. సరూర్ నగర్ చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసుల డిమాండ్.
  • ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్. తనపై విపక్ష సభ్యుల దుష్ప్రవర్తనకు నిరసనగా దీక్ష. ఈనెల 20న వ్యవసాయ బిల్లుల సందర్భంగా సభ్యుల దురుసు ప్రవర్తన.
  • ఆసిపాబాద్: తృటిలో తప్పించుకున్న బాస్కర్ టీం, మంగిదళం సభ్యుల కోసం మూడవ రోజు కొనసాగుతున్న వేట. కొమురంభీం- మంచిర్యాల మావోయిస్టు డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ లక్ష్యంగా ఆపరేషన్. మూడంచెల పహారాతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అణువణువు గాలిస్తున్న గ్రే హౌండ్స్ బలగాలు. తెలంగాణ - మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల వద్ద పటిష్ఠ నిఘా . ప్రాణహిత పరివాహక ప్రాంతాలైన మంచిర్యాల, ఆసిపాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 18 గ్రేహౌండ్స్‌ దళాల ఆధ్వర్యంలో అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు. కడంబ, సిద్దేశ్వర గుట్టలు , తిర్యాణి , పెంబి, కోటపల్లి - వేమనపల్లి, కవ్వాల్ అభయారణ్యాలలో డ్రోన్‌ కెమెరాల సాయంతో కొనసాగుతున్న పహరా. కీలకంగా మారిన మావోయిస్టుల వద్ద దొరికిన డంప్. ఆసిపాబాద్ జిల్లా తిర్యాణి మండలం గుండాల వద్ద, దంతన్‌పల్లి సమీపంలో, కడంబా అడవుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో మూడు చోట్ల దొరికిన మావోయిస్టుల కిట్లు, డైరీలతో భారీగా రిక్రూట్మెంట్ జరిగినట్టు ప్రాథమిక అంచనా. పోలీసుల బూట్ల చప్పులతో వణికిపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు. జిల్లా సరిహద్దు‌ దాటి పోకుండా మహరాష్ట్ర - చత్తీస్‌గఢ్ పోలీసుల సహకారం తీసుకుంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ బలగాలు.
  • నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ . మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఏర్ పోర్ట్ నుండి ఢిల్లీకి కి పయనం . పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ను కలిసే అవకాశం . రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలు తో సహా పలు అంశాలు ప్రస్తావించే అవకాశం . డిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష చేయనున్న సీఎం జగన్ . క్యాంప్ కార్యాలయం లో 11 గంటలకు సమీక్ష . కేంద్రం నుండి రావాల్సిన నిధులు, బకాయిలు వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం.
  • చెన్నై: తమిళనాడు లో కురుస్తున్న భారీ వర్షాలు , వరద ప్రభావానికి ఉప్పొంగి ప్రవహిస్తున్న జలాశయాలు . కేరళ- తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కన్యాకుమారి, నీలగిరి , కోయిఅంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . భారీ వర్షాలకు ఇప్పటికే రెండు సార్లు నిండిపోయిన భవానిసాగర్ డాం. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ. కర్ణాటక - తమిళనాడు సరిహద్దు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరీ నది .కర్ణాటక లోని కేఆర్ ఎస్ డాం నుండి 50 వేల కుసెక్యూల నీరు దిగువకు విడుదల చేయడం తో పెరిగిన వరద ఉధృతి . ధర్మపురి ,క్రిష్ణగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడం తో వరద ముంపు ఎక్కువగా ఉంటుందని వరద ముంపు గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు. కేరళ , కర్ణాటక నుండి భారీగా వరదనీరు వస్తుండడం తో సరిహద్దు జిల్లాలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. వరద ముంపు ఉండడం తో ముఖ్యమైన డాం ల నుండి ఎప్పటికపుడు గేట్లు ఎత్తివేసి నీటి ని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు .
  • అమరావతి: సీఐడీకి సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు. రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నంపై కేసు నమోదు. సీఐడీ ఏడిజి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ. నిందితుల కోసం పశ్చిమబెంగాల్, కర్ణాటక, దిల్లీలకు ప్రత్యేక బృందాలు. దిల్లీలోని శర్మ ఫోర్సింగ్. పశ్చిమ బెంగాల్ లోని మల్లబపూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. కర్ణాటకలోని అద్వైత వీకే , హోలో బ్లాక్స్ &ఇంటర్ లాక్ సంస్థల పేరిట ఫోర్జరీ చెక్కులను గుర్తింపు. ఈ అంశాలపై సీఐడీ ఆరా. ఫోర్జరీ వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్న తుళ్లూరు పోలీసులు. మరో వైపు ఏసీబీ అంతర్గత విచారణ. గతంలో ఎప్పుడైనా నకిలీ చెక్కులతో నగదును మార్చారా అనే కోణంలోనూ ఆరా .

డబ్బింగ్ చెప్తున్నంతసేపూ ‘భీష్మ’ చాలా క్యూట్ ఫిల్మ్ అనిపించింది – రష్మికా మందన్న

Rashmika Special Interview about Beeshma Movie, డబ్బింగ్ చెప్తున్నంతసేపూ ‘భీష్మ’ చాలా క్యూట్ ఫిల్మ్ అనిపించింది – రష్మికా మందన్న

“డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది” అన్నారు రష్మికా మందన్న. నితిన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా ‘భీష్మ’లో ఆమె నాయికగా నటించారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రష్మికతో మీడియా ప్రతినిధుల మాటామంతీ…

‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు?
అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం.

సినిమా చూశారా?
లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా.

‘భీష్మ’లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు?
మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు.

అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది?
ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను.

ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది?
మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ ‘భీష్మ’లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. ‘భీష్మ’ అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘భీష్మ’ చాలా మంచి ఫిల్మ్.
వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా?
రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు.
నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా?
మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. ‘పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?’ అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్.

నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
నేను సరదాగా చెప్పడం లేదు. ‘అ ఆ’లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం.

మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది?
నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు?
ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు ‘భీష్మ’ను నిర్మించారు.

‘ఛలో’ నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు.

వేలంటైన్స్ డేని ఎలా గడిపారు?
వేలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అలా నా వేలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వేలంటైన్స్ డేని గడిపి ఉండరు.

పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు?
కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి. కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. ‘భీష్మ’ ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా.

అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు?
మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు.

Related Tags