Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

రష్మిక ఆవేదన.. ఐటీ రైడ్స్‌పై ఏం చెప్పిందంటే?

Actress Rashmika respond over IT raids, రష్మిక ఆవేదన.. ఐటీ రైడ్స్‌పై ఏం చెప్పిందంటే?

తెలుగు సినిమాల్లో టాప్‌ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె వాపోయింది. “గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక. తాజాగా.. మహేష్‌ బాబుతో, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసింది. ఈ సినిమా విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. తాజాగా మరో స్టార్‌ హీరో అల్లుఅర్జున్‌తో నటించేందుకు సిద్ధమవుతుండగా.. రష్మికకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం కర్నాటలోని ఆమె ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.

రష్మిక ఇంటిలోనే కాకుండా కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ మండపం, యాడ్ ఎజెన్సీ, ఇతర వ్యాపార సంస్థల్లో సోదాలు జరిపారు. అంతే కాకుండా రష్మిక తం డ్రి మదన్‌ మంజన్నా, తల్లి సుమన్‌ల పేరుతో గత ఒక్క ఏడాదిలోనే కోట్లాది రూపాయల విలువైన సొత్తు జమ అయినట్లు గుర్తించారు ఐటీ అధికారులు. వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వాటిపై ఎటువంటి ధృవీకరణ పత్రాలను రష్మిక పేరెంట్స్‌ చూపించకపోవటంతో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై వాటి వివరాలు అందించాలని ఐటీ నోటీసులో వెల్లడించారు అధికారులు.

ఐటీ సోదాల అంశంపై ఇప్పటికే రష్మిక మేనేజర్‌ స్పందించారు. రష్మికకు చెందిన ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఆమె ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లింపులు అన్నీ సక్రమంగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఆదాయపన్ను శాఖ అధికారులు రష్మిక తండ్రికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులపై సోదాలు నిర్వహించినట్లు వివరించారు.

తన ఇంటిలో జరిగిన ఐటీ సోదాలపై రష్మిక రియాక్షన్‌ మరోలా ఉంది. తాను అధిక పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి తాను భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటించే స్థాయికి ఇంకా ఎదగలేదని చెబుతోంది. సోదాల వ్యవహారంలో ఆదాయపన్ను శాఖతో చట్టపరంగానే ఎదుర్కొంటానని చెప్పింది రష్మిక మందన్న.

Actress Rashmika respond over IT raids, రష్మిక ఆవేదన.. ఐటీ రైడ్స్‌పై ఏం చెప్పిందంటే?

Related Tags