బోల్డ్ రోల్‌లో రాశి..రీ ఎంట్రీ అదిరిపోయేనా?

light house cine magic production No 2 new movie opening, బోల్డ్ రోల్‌లో రాశి..రీ ఎంట్రీ అదిరిపోయేనా?

ఒకప్పటి అందాల తార రాశి గురించి ఎంత చెప్పిన తక్కువే. అభినయం, పాాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ఎవర్‌గ్రీన్ బ్యూటీ.. ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా సరైన సినిమాలు పడలేదు.  అందుకే ఆచి తూచి కొత్త సినిమాను సెలక్ట్ చేసుకుంది. ఇందులో కాస్త బోల్డ్ క్యారెక్టర్‌లో నటించనున్నట్టు తాజాగా జరిగిన మూవీ లాంఛ్ ఈవెంట్‌లో రాశినే చెప్పింది.  లైట్​హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై సంజీవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకునే మహిళ పాత్రలో నటిస్తోంది. ఆమె కుమార్తెగా నందితా శ్వేత నటించనుంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో శనివారం లాంఛనంగా ప్రారంభిమైందీ సినిమా. నటులు అశోక్ కుమార్, పోసాని కృష్ణమురళి, నిర్మాత సి.కల్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *