Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

సీఎం జగన్ నాకు స్పూర్తి: నవనీత్ కౌర్

MP Navneet Kaur, సీఎం జగన్ నాకు స్పూర్తి: నవనీత్ కౌర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మహారాష్ట్ర ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ అనేక కష్టాలను ఎదుర్కొని ఏపీకి సీఎం అయిన జగన్ తనకు ఆదర్శమన్నారు. కాగా ఇండిపెండెంట్‌గా యాభైవేల మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నవనీత్ కౌర్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ తన వాయిస్ గట్టిగా వినిపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం గురించి నాలుగు ప్రశ్నలను పార్లమెంట్‌లో లేవనెత్తి.. అందరి దృష్టిని ఆకర్షించారు. తాను ఇప్పుడు ఎంపీ అయినప్పటికీ నవనీత్ కౌర్ అనే పేరు ప్రపంచానికి తెలిసేలా చేసింది తెలుగు ప్రజలే అని చెప్పారు. హీరోయిన్‌గా తనను ఆదరించిన తెలుగువారితో ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

తాను రాజకీయాల్లోకి వెళ్లడం.. దేశం తరుపున లోక్ సభలో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు. తాను తెలుగు సినిమాల్లో పనిచేసి ఉండటం వల్ల.. ఎంపీగా గెలిచిన తరువాత లోక్ సభలో అడుగుపెట్టి తెలుగు వాళ్లు ఎవరున్నారు? ఆంధ్ర వాళ్లు ఎవరు ఉన్నారు అని చూసుకున్నా. ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటన్న దానిపై అవగాహన ఉంది. తనకు మహారాష్ట్ర అంటే ఇష్టమే కాని.. ఆంధ్ర అంటే ప్రాణం అని చెప్పారు. ఎందుకంటే తన కెరియర్‌ని హీరోయిన్‌గా ఆంధ్ర నుంచే ప్రారంభించానన్నారు. అప్పుడు ఆంధ్రనే. ఇప్పుడు రెండు ప్రాంతాలుగా విడిపోయింది కాని.. నవనీత్ కౌర్ ఎవరన్నదాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆంధ్రనే. తన పేరు ఎవరికీ తెలియని సందర్భంలో ఆంధ్ర జనం.. తనకు పేరుతో పాటు ఫేమ్ ఇచ్చారని అంతకు మించి మంచి స్టేటస్ ఇచ్చారని నవనీత్ కౌర్ అన్నారు.

నవనీత్ కౌర్ ఆర్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మహారాష్ట్రలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న రవి రాణాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త రవిరాణా ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

Related Tags