పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన మంచు లక్ష్మీ.. వాళ్లే ప్ర‌త్య‌క్ష దైవాలు..

లాక్‌డౌన్ టైమ్‌లో పోలీసులు ఎంత క‌ష్ట‌ప‌డి పని చేశారో మనం చూశాం. తెలంగాణ స్టేట్‌లో 98 మంది పోలీసుల‌కు క‌రోనా వ‌చ్చింద‌ని, వాళ్లకు న‌య‌మైన త‌ర్వాత మ‌ళ్లీ విధుల్లోకి చేరార‌ని విన్నాను. సూప‌ర్‌మేన్‌, స్పైడ‌ర్ మేన్‌, రాముడు, కృష్ణుడు గురించి పుస్త‌కాల్లో చ‌ద‌వ‌డ‌మే..

పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన మంచు లక్ష్మీ.. వాళ్లే ప్ర‌త్య‌క్ష దైవాలు..
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2020 | 4:06 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 43,780 ఉండగా, 409 మంది మరణించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మాయదారి మహమ్మారి ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది పోలీసు సిబ్బంది ఈ వైరస్ బారిన సంగతి తెలిసిందే. అలాగే వారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది మంచు లక్ష్మీ.

ఈ సందర్బంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ టైమ్‌లో పోలీసులు ఎంత క‌ష్ట‌ప‌డి పని చేశారో మనం చూశాం. తెలంగాణ స్టేట్‌లో 98 మంది పోలీసుల‌కు క‌రోనా వ‌చ్చింద‌ని, వాళ్లకు న‌య‌మైన త‌ర్వాత మ‌ళ్లీ విధుల్లోకి చేరార‌ని విన్నాను. సూప‌ర్‌మేన్‌, స్పైడ‌ర్ మేన్‌, రాముడు, కృష్ణుడు గురించి పుస్త‌కాల్లో చ‌ద‌వ‌డ‌మే కానీ ఎప్పుడూ చూడ‌లేదు. ఇప్పుడు వీరిని చూస్తుంటే అర్థమవుతోంది. ప్ర‌త్య‌క్ష దైవాలు మ‌న‌కు పోలీసులే. త‌మ కుటుంబాల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల‌ను ర‌క్షిస్తున్న పోలీసుల‌కు నా ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొంది మంచు లక్ష్మీ.

Read More:

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి

పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్