ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జోడీగా నటించిన ‘ సాహో ‘ చిత్రంపై అప్పుడే విమర్శల వెల్లువ ప్రారంభమైంది. బాలీవుడ్ నటి లీసా రే తొలి షాకింగ్ బాంబ్ పేల్చింది. ఈ సినిమాలోని ఓ సాంగ్ తాలూకు పోస్టర్.. ఓ క్రియేటర్ సృష్టించిన ఆర్ట్ వర్క్ ని పూర్తిగా కాపీ కొట్టినట్టు ఉందని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్ టా గ్రామ్ లో షేర్ చేసింది.’ షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ ని ఒక్కసారి చూడండి […]
Follow us
ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జోడీగా నటించిన ‘ సాహో ‘ చిత్రంపై అప్పుడే విమర్శల వెల్లువ ప్రారంభమైంది. బాలీవుడ్ నటి లీసా రే తొలి షాకింగ్ బాంబ్ పేల్చింది. ఈ సినిమాలోని ఓ సాంగ్ తాలూకు పోస్టర్.. ఓ క్రియేటర్ సృష్టించిన ఆర్ట్ వర్క్ ని పూర్తిగా కాపీ కొట్టినట్టు ఉందని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్ టా గ్రామ్ లో షేర్ చేసింది.’ షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ వర్క్ ని ఒక్కసారి చూడండి . అలాగే..ఈ మూవీలో.. ప్రభాస్, శ్రధ్ధాకపూర్ కలిసి ఉన్న ‘ బేబీ వోంట్ యూ టెల్ మీ ‘ అనే పాట వెనుక ఉన్న ఆర్ట్ వర్క్ చూడండి.. మక్కికి మక్కి కాపీ కొట్టినట్టు లేదూ ? ‘ అని లీసా ప్రశ్నించింది. ఈ రెండింటిలో బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ వర్క్ ఒకేలా ఉంది. అసలు సృజనాత్మకత అంటే ఏమిటి ? కళ ఎక్కడినుంచి వస్తుంది ? ‘ సాహో ‘ మేకర్స్ చేసిన పని స్ఫూర్తిమంతంగా ఉందా ? ఇది పూర్తిగా దొంగతనమే. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేకర్స్ అసలు క్రియేటర్ అయిన షిలోను కాంటాక్ట్ చేయలేదు. పర్మిషన్ కూడా తీసుకోలేదు.. కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదు.. అని లీసా రే మండిపడింది. దీనికి నిర్మాతలను జవాబుదారీ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ‘ ఒక దొంగ మీ ఇంట్లో చొరబడి ,ఈ అమూల్యమైన హృదయాన్ని, ఆత్మను, మీ జీవన గమనాన్ని, మనుగడను దొంగిలించుకుపోతే మీకెలా ఉంటుంది ? అని లీసా రే ప్రశ్నించింది.