మ‌రో న‌టికి క‌రోనా పాజిటివ్‌

coronavirus పేద, ధనిక, సాధారణ వ్యక్తి, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ఈ వైరస్ ప్రతీ ఒక్కరినీ కాటేస్తోంది. ఇప్పటికే కొందరు సినీ సెల‌బ్రిటీలు కరోనా బారిన పడగా, తాజాగా మ‌రో న‌టి ఆ లిస్టులో చేరింది.

మ‌రో న‌టికి క‌రోనా పాజిటివ్‌
Follow us

|

Updated on: Apr 24, 2020 | 12:56 PM

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌తాపం కొన‌సాగుతోంది. ప‌ల్లెప‌ట్నం అనే తేడా లేకుండా అంద‌రినీ ప‌ట్టిపీడిస్తోంది. పేద, ధనిక, సాధారణ వ్యక్తి, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ఈ వైరస్ ప్రతీ ఒక్కరినీ కాటేస్తోంది. ఇప్పటికే కొందరు సినీ సెల‌బ్రిటీలు కరోనా బారిన పడగా, తాజాగా మ‌రో న‌టి ఆ లిస్టులో చేరింది.
గతంలో సింగర్ కనికా కరోనాతో పోరాడి చివరకు నెగెటివ్ రిపోర్ట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత పలువురు విదేశీ నటులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. టామ్ హాంక్స్, రీటా విల్సన్ లాంటి హాలీవుడ్ నటుడు కరోనా బారిన ప‌డ్డారు. ఇప్పుడు స్పానిష్ నటి ఇజియార్ ఇతునోకు కోవిడ్ -19 వైర‌స్ సోకిన‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మనీ హీస్ట్‌లో కీలక పాత్ర పోషించి ఫేమస్ అయింది ఇజియార్ ఇతునో. ఆమె కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా టెస్ట్ చేయ‌టంతో క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అంద‌జేస్తున్నారు. క‌రోనా ను అంత తేలిగ్గా తీసుకుని ఎవ‌రూ ప్రాణాలు పోగొట్టుకోవ‌ద్ద‌ని ఆమె సూచించింది.