కిస్ ఫొటోతో.. అర్చన బయటపెట్టిన నిజం..!

‘శ్రీరామదాసు’ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించిన అర్చన గురించి తెలిసే ఉంటుంది. బిగ్‌బాస్ సీజన్ 1లో కూడా ఆమె గట్టి పోటీ ఇచ్చింది. అలాగే.. పలు సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్.. కొన్ని బలమైన పాత్రలు చేసింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా.. ఆమె బాయ్‌ ఫ్రెండ్‌తో హ్యాపీగా షికారులు చేస్తోంది. ఈ మధ్య ఓ రెస్టారెంట్‌లో బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ […]

కిస్ ఫొటోతో.. అర్చన బయటపెట్టిన నిజం..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:43 AM

‘శ్రీరామదాసు’ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించిన అర్చన గురించి తెలిసే ఉంటుంది. బిగ్‌బాస్ సీజన్ 1లో కూడా ఆమె గట్టి పోటీ ఇచ్చింది. అలాగే.. పలు సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్.. కొన్ని బలమైన పాత్రలు చేసింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా.. ఆమె బాయ్‌ ఫ్రెండ్‌తో హ్యాపీగా షికారులు చేస్తోంది.

ఈ మధ్య ఓ రెస్టారెంట్‌లో బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “త్వరలోనే మీ అందరితో ఓ గొప్ప వార్తను పంచుకోబోతున్నానని, ఆ విషయాన్ని మీరు ఊహించి ఉండరని.. అప్పటి వరకూ నా ఫ్రెండ్ జయంతి తీసిన ఫొటోలను ఎంజాయ్ చేయండంటూ’.. అప్‌లోడ్ చేసింది. అర్చన పక్కన ఉన్న వ్యక్తి ఆమెను.. కిస్ చేస్తుండటం చూస్తుంటే.. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. ఆమె పోస్ట్‌తో.. త్వరలోనే పెళ్లి వార్తను చెప్పబోతుందని అర్థమవుతోంది.

Actress Archana Shares her boyfriend Pic