చెన్నైలో విజయ్‌ ఫ్యాన్స్ హల్‌చల్..! పోలీస్ బారికెడ్లను తగులబెట్టి..

విజయ్ విజిల్ సినిమా సందర్భంగా.. చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయ్ సినిమా విజిల్ ప్రివ్యూలను రద్దు చేయడంతో.. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో.. వారు థియేటర్లపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అభిమాన నటుడు సినిమాకు ప్రివ్యూలు లేకుండా చేస్తారా అంటూ.. ఫ్యాన్స్ పెద్ద గొడవ చేశారు. అదే విధ్వంసానికి కూడా దారితీసింది. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘విజిల్’ సినిమా రిలీజ్ ఉంది. ఆ సినిమాకి ప్రివ్యూలు రద్దు చేయడంతో.. అభిమానుల […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:32 pm, Fri, 25 October 19

విజయ్ విజిల్ సినిమా సందర్భంగా.. చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయ్ సినిమా విజిల్ ప్రివ్యూలను రద్దు చేయడంతో.. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో.. వారు థియేటర్లపై దాడి చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. అభిమాన నటుడు సినిమాకు ప్రివ్యూలు లేకుండా చేస్తారా అంటూ.. ఫ్యాన్స్ పెద్ద గొడవ చేశారు. అదే విధ్వంసానికి కూడా దారితీసింది. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘విజిల్’ సినిమా రిలీజ్ ఉంది. ఆ సినిమాకి ప్రివ్యూలు రద్దు చేయడంతో.. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. క్రిష్ణగిరి ఏరియాలోని థియేటర్‌లపై విజయ్ అభిమానులు విరుచుకుపడ్డారు. థియేటర్‌లోని సీసీ కెమెరాలు, అలాగే.. పోలీస్ బారికెడ్లపై తమ ప్రతాపం చూపించారు. పోలీసులు కట్టడి చేసినా.. ఆగకపోవడంతో.. పరిస్థితి శ్రుతిమించింది. దీంతో ఎంటరైన పోలీసులు.. విజయ్ ఫ్యాన్స్‌ని లాఠీఛార్జ్ చేసి.. అరెస్ట్ చేశారు.