ముంబైలో టీవీ నటిపై ప్రేమోన్మాది హత్యా యత్నం

ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యాయత్నం జరిగింది. మాల్వీ  స్నేహితుడే ఆమెపై కత్తితో దాడి చేయగా ఆమె చేతులపై, పొత్తికడుపులో గాయాలయ్యాయి. అతడిని యోగేష్ కుమార్ మహీపాల్ సింగ్ గా గుర్తించారు. కత్తిపోట్లకు గురైన మాల్వీ..ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏడాది కాలంగా తమ ఇద్దరికీ పరిచయం ఉందని, తాము ఫ్రెండ్స్ గా మసలుకుంటున్నామని మాల్వీ పోలీసులకు తెలిపింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని యోగేష్ ఒత్తిడి తేవడంతో తాను తిరస్కరించానని, దీంతో  కోపంతో తనపై దాడికి […]

  • Umakanth Rao
  • Publish Date - 3:56 pm, Tue, 27 October 20

ముంబైలో టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై హత్యాయత్నం జరిగింది. మాల్వీ  స్నేహితుడే ఆమెపై కత్తితో దాడి చేయగా ఆమె చేతులపై, పొత్తికడుపులో గాయాలయ్యాయి. అతడిని యోగేష్ కుమార్ మహీపాల్ సింగ్ గా గుర్తించారు. కత్తిపోట్లకు గురైన మాల్వీ..ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏడాది కాలంగా తమ ఇద్దరికీ పరిచయం ఉందని, తాము ఫ్రెండ్స్ గా మసలుకుంటున్నామని మాల్వీ పోలీసులకు తెలిపింది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని యోగేష్ ఒత్తిడి తేవడంతో తాను తిరస్కరించానని, దీంతో  కోపంతో తనపై దాడికి దిగాడని వెల్లడించింది.

దుబాయ్ నుంచి మాల్వీ నిన్న రాత్రి ముంబై చేరుకోగా, వెర్సోవా ప్రాంతంలో ఆమెను యోగేష్ అడ్డగించి మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, ఎప్పట్లాగే ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో పొడిచి పారిపోయాడని తెలుస్తోంది.  పరారీలో ఉన్న అతడిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.