రాజకీయాల్లోకి సంజూ భాయ్ రీ ఎంట్రీ..?

బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారు. సెప్టెంబర్ 25న సంజయ్ దత్ రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌(ఆర్‌ఎస్‌పీ)లో చేరుతాడని.. ఆ పార్టీ వ్యవస్థాపకులు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జంకర్ తెలిపారు. పార్టీని బలపరిచే క్రమంలో కొంతమంది సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. అందులో భాగంగానే సంజయ్‌ను సంప్రదించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఇంకా సంజయ్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాగా సంజయ్ దత్‌కు రాజకీయాలు కొత్తేం కాదు. ఆయన తండ్రి సునీల్ దత […]

రాజకీయాల్లోకి సంజూ భాయ్ రీ ఎంట్రీ..?
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 10:49 AM

బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్ తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారు. సెప్టెంబర్ 25న సంజయ్ దత్ రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌(ఆర్‌ఎస్‌పీ)లో చేరుతాడని.. ఆ పార్టీ వ్యవస్థాపకులు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జంకర్ తెలిపారు. పార్టీని బలపరిచే క్రమంలో కొంతమంది సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. అందులో భాగంగానే సంజయ్‌ను సంప్రదించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఇంకా సంజయ్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

కాగా సంజయ్ దత్‌కు రాజకీయాలు కొత్తేం కాదు. ఆయన తండ్రి సునీల్ దత కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా గెలవడంతో పాటు మన్మోహన్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక ఆ తరువాత సంజయ్ సైతం ఎస్పీలో చేరి.. 2009లో లక్నో నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అదే సమయంలో ఆయుధాల కేసులో దోషిగా తేలడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడు. అనంతరం ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేసిన సంజయ్.. ఆ పదవి నుంచి వైదొలగడంతో పాటు పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ అతడు పోటీ చేస్తాడని వార్తలు వచ్చినా.. అవన్నీ వదంతులేనని సంజయ్ తోసిపుచ్చారు.