శివ పార్వతి మాటలపై స్పందించిన ప్రభాకర్‌

తనకు కరోనా సోకిందని, పట్టించుకునే వారు కరువయ్యారని ఇటీవల నటి శివపార్వతి భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే.

శివ పార్వతి మాటలపై స్పందించిన ప్రభాకర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 4:10 PM

Actress Siva Parvati: తనకు కరోనా సోకిందని, పట్టించుకునే వారు కరువయ్యారని ఇటీవల నటి శివపార్వతి భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. అందులో నిర్మాత ప్రభాకర్ అస్సలు పట్టించుకోలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా ప్రభాకర్ స్పందించారు.

”శివపార్వతి అమ్మ ఓ వీడియోను విడుదల చేశారు. దాని మీద స్పందించమని నన్ను అభిమానించే వాళ్లు అడిగారు. అసలేం జరిగిందని అందరూ అడుగుతున్నారు. ఇంతమంది అడుగుతున్నా ఆ వీడియో గురించి ఎందుకు మాట్లాడలేదంటే.. అమ్మని చాలా రోజుల తరువాత నిన్ననే వీడియోలో చూశాను. ఆమె నుంచి నాకు ఎలాంటి ఫోన్లు రాలేదు. నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు, వాళ్ల అబ్బాయి మాడ్లాడేవారు. ఇవన్నీ అమ్మకు తెలీకపోవడం వలనే చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్ జరిగింది. అందుకే బాధపడి వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కోలుకున్న తరువాతనే ఈ విషయం గురించి మాట్లాడాలి అని నేను అనుకున్నా. కానీ అమ్మ ఇందాక ఫోన్ చేసి.. నాకు క్షమాపణ చెప్పారు. చిన్న పొరపాటు జరిగిందని అన్నారు. అపార్థం చేసుకోవడం వలనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ వీడియోను తాను యూట్యూబ్‌లో పెట్టలేదని, బయటకు ఎలా వెళ్లిందో తెలీదని అమ్మ అన్నారు. అసలు జరిగిన దానిపై ఇంకో వీడియో పెడతానన్నారు. కానీ ముందు మీ ఆరోగ్యం చూసుకోండని చెప్పా. అమ్మ‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా చూసుకోడానికి మేమున్నాం. అమ్మకే కాదు, ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఏ ఆప‌ద‌ వ‌చ్చినా అంద‌రం సాయం చేస్తాం. శివ పార్వ‌తి అమ్మ‌కు క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సాయపడ్డ మా ఇండ‌స్ట్రీ గొప్ప వ్య‌క్తులు, శివ‌బాలాజీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్, జీవితా రాజ‌శేఖ‌ర్‌ అందరికీ చాలా చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈ విష‌యం గురించి త‌ప్ప‌కుండా నేను వివ‌ర‌ణ ఇస్తాను. అమ్మ కూడా వివ‌ర‌ణ ఇస్తారు. ప్ర‌స్తుతానికి అమ్మ కోలుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా మ‌నమందరం కోరుకుందాం అని ప్రభాకర్ అన్నారు.

Read More:

‘టైటానిక్’ హీరోకు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు సవాల్‌

పడిపోయిన అమ్మకాలు.. హార్లే డేవిడ్సన్ కీలక నిర్ణయం!

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన