Breaking News
  • ప్రకాశం: కనిగిరిలో డాక్టర్‌ విద్యాసాగర్‌పై కేసు. ఈనెల 11న కజికిస్థాన్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ విద్యాసాగర్‌. సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో డాక్టర్‌పై కేసు.
  • విజయనగరం: కొత్తవలసలో పోలీసుల దురుసుప్రవర్తన. విధి నిర్వహణలో ఉన్న లైన్‌మన్‌పై పోలీసుల దాడి. చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.
  • అమరావతి: బయోమెట్రిక్ లేకుండానే రేషన్‌ ఇస్తున్నాం. ఇబ్బందులు ఉంటే తహశీల్దార్‌, ఎండీవోకు ఫిర్యాదు చేయండి. పేదలందరికీ రేషన్‌ వచ్చేలా చర్యలు-మంత్రి కొడాలి నాని.
  • సీఎం సహాయనిధికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఐపీఎస్‌ల అసోసియేషన్‌, విరాళాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేసిన అసోసియేషన్‌ అధ్యక్షుడు అంజనీకుమార్‌.
  • స్పెయిన్‌లో విజృంభిస్తున్న కరోనా. కరోనాతో స్పెయిన్‌ రాకుమారి మారియా టెరెసా మృతి.

Actor Death: సినీ నటుడు నందూరి ఉదయ్ కిరణ్ మృతి..!

Actor Nanduri Uday Kiran, Actor Death: సినీ నటుడు నందూరి ఉదయ్ కిరణ్ మృతి..!

Actor Nanduri Uday Kiran: టాలీవుడ్‌ నటుడు నందూరి ఉదయ్ కిరణ్(34) మృతి చెందారు. గుండెపోటుతో శుక్రవారం రాత్రి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అతడు కన్నుమూశారు. అతడి మృతదేహాన్ని రామారావు పేటలోని స్వగృహానికి తరలించారు. అయితే పరారే పరారే, ఫ్రెండ్స్ బుక్‌తో పాటు పలు తమిళ సినిమాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. ఆయన మృతిపై పలువురు పెద్దలు, రాజకీయ నాయకులు సానుభూతిని తెలుపుతున్నారు.

Related Tags