వరుణ్ తేజ్ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్.. సెట్ అయితే సూపర్!
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కోసం మెగా ప్లాన్ రెడీ చేశారు సీనియర్ నటుడు నాగబాబు. అదికానీ వర్కౌట్ అయితే మాత్రం అదిరిపోవాల్సిందే అంటున్నారు. మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటీ అనుకుంటున్నారా? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో...
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కోసం మెగా ప్లాన్ రెడీ చేశారు సీనియర్ నటుడు నాగబాబు. అదికానీ వర్కౌట్ అయితే మాత్రం అదిరిపోవాల్సిందే అంటున్నారు. మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటీ అనుకుంటున్నారా? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో సైతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ అంటే వేరే భాషలో హిట్టైన సినిమాలను రీమేక్ చేయడం కాదు. సూపర్ హిట్ అయిన పాత సినిమాలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు రీమేక్ చేయడం. ప్రస్తుతం ఈ ఆలోచన పెరిగింది. వరుణ్‌కి కూడా ఉన్నట్టు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు. తాజాగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఈయన.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఓ అభిమాని.. మీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఏ సినిమాని వరుణ్ రీమేక్ చేస్తే బాగుంటుందని అడగ్గా .. నాగబాబు ఇలా సమాధానం ఇచ్చారు. అన్నయ్య చేసిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలను.. వరుణ్ రీమేక్ చేస్తే చూడాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టారు. ఈ రెండు సినిమాలు కూడా చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సాధించాయి. ఈ రెండు సినిమాల్లోని పాత్రలని వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు.. హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు నాగబాబు.
ఈ సినిమాల్లోని పాత్రలు వరుణ్‌కి బాగా సెట్ అవుతాయన్నారు. ఇక చిరంజీవి కెరీర్లో స్పెషల్ చిత్రాలుగా నిలిచిన ఈ రెండింటిని వరుణ్ చేయడం పెద్ద సాహసమే అని కూడా పేర్కొన్నారు నాగబాబు. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
Read More:
వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు
‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్
బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!
జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..