కేసీఆర్‌పై ఫైరయ్యాడా..! కూలయ్యాడా..!: మంచు విష్ణు

ఇంటర్ ఫలితాలు, ప్రభుత్వ తీరుపై కాస్త ఆలస్యంగా స్పందించిన నటుడు మంచు విష్ణు. తన ట్విట్టర్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై వరుస ట్వీట్‌లు చేశాడు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. కేటీఆర్ చాలా ఆక్టీవ్ పర్సన్. దేశం కోసం పనిచేసే వ్యక్తులలో కేటీఆర్ ఒకరు. అలాగే.. కేసీఆర్ ఫైర్ బ్రాండ్.. తప్ప డిక్టేటర్ కాదు. చాలా మంది అంటున్నారు.. కేసీఆర్‌కు భయపడే మేము ఈ విషయంపై స్పందించలేదని.. నిజానికి అలా కాదని చెప్పడానికే నేను […]

కేసీఆర్‌పై ఫైరయ్యాడా..! కూలయ్యాడా..!: మంచు విష్ణు
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 12:35 PM

ఇంటర్ ఫలితాలు, ప్రభుత్వ తీరుపై కాస్త ఆలస్యంగా స్పందించిన నటుడు మంచు విష్ణు. తన ట్విట్టర్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై వరుస ట్వీట్‌లు చేశాడు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. కేటీఆర్ చాలా ఆక్టీవ్ పర్సన్. దేశం కోసం పనిచేసే వ్యక్తులలో కేటీఆర్ ఒకరు. అలాగే.. కేసీఆర్ ఫైర్ బ్రాండ్.. తప్ప డిక్టేటర్ కాదు. చాలా మంది అంటున్నారు.. కేసీఆర్‌కు భయపడే మేము ఈ విషయంపై స్పందించలేదని.. నిజానికి అలా కాదని చెప్పడానికే నేను ఇప్పుడు ట్వీట్ చేశానని పేర్కొన్నాడు విష్ణు. ముందు సమస్య ఏంటో గుర్తించి.. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాని తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న 20 మంది విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకున్నారని.. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోయి ఉంటే కచ్చితంగా నేను కూడా విమర్శలు చేసేవాడినని ట్వీటించాడు.