మీకు నిద్ర పట్టడంలేదా..? నా సినిమాలు చూడండి..!

Actor madhavan funny twitter banter with netizens makes you laugh like anything, మీకు నిద్ర పట్టడంలేదా..? నా సినిమాలు చూడండి..!

హీరో మాధవన్ షోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఏవిషయంపైనైనా.. ట్వీట్ చేస్తూ ఉంటారు. అలాగే.. ఫ్యాన్స్‌తో కూడా చాలా ఫ్రెండ్లీగా మాడ్లాడుతుంటారు. ఇప్పుడు మనకు ఆయనెందుకు గుర్తొచ్చారంటే.. మాధవన్ చేసిన ట్వీట్.. ప్రస్తుతం ఫుల్ వైరల్‌గా మారింది. ‘మీకు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా..! అయితే నా సినిమా చూడండి అంటూ’ ట్వీట్ చేశారు. దీనికి లతా శ్రీనివాస్ ‌అనే నెటిజన్‌.. నిద్రలేమికి పరిష్కారాలు చెప్పండి అని ట్వీట్ చేసింది. ఇందుకు మాధవన్.. ‘ఆన్సర్ ఇస్తూ.. నేను పూర్తిగా లీనమైపోయి నటించిన సినిమాలు చూడండి’ అని ఫన్నీగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లకు నెటిజన్లు సానుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు.

మీమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి సార్.. మీరు చాలా మంది సినిమాలు చేశారు. మిమ్మల్ని చూస్తే మాకు నిద్రపట్టదంటూ ట్వీట్లు చేశారు. అందులో ఒకరు.. ఒక ఫొటో షేర్‌ చేస్తూ.. చూడండి ఈ ఫొటోలో మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. అని ట్వీట్ చేసింది. దానికి మాధవన్.. ఆ ఫొటో చూస్తుంటే.. ఇప్పుడు నాకు నిద్రపట్టదేమో.. ఆ ఫొటో చూస్తుంటే.. నాకు ఏడుపొస్తుంది.. అది రెండేళ్ల క్రితంది.. ఆ లుక్స్ రమ్మన్నా.. ఇప్పుడు రాదు అని నవ్వుతూ వున్న ఇమోజీని పెడుతూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *