బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కి రైతుల నిరసన సెగ, పంజాబ్‌లో మూవీ షూటింగ్‌కి అంతరాయం, మద్దతుగా స్టేట్ మెంట్ ఇవ్వక తప్పలేదు

పంజాబ్ లో తన చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కి రైతుల నిరసన సెగ తప్పలేదు. గుడ్ లక్ జెర్రీ అనే పంజాబీ సినిమాలో నటిస్తోంది జాన్వి..

  • Umakanth Rao
  • Publish Date - 11:03 am, Thu, 14 January 21
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌కి రైతుల నిరసన సెగ, పంజాబ్‌లో మూవీ షూటింగ్‌కి అంతరాయం, మద్దతుగా స్టేట్ మెంట్ ఇవ్వక తప్పలేదు

పంజాబ్ లో తన చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కి రైతుల నిరసన సెగ తప్పలేదు. గుడ్ లక్ జెర్రీ అనే పంజాబీ సినిమాలో నటిస్తోంది జాన్వి . గత సోమవారం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా రైతులు గుంపులుగా అక్కడికి దూసుకువచ్చారు. తమ ఆందోళనకు మద్దతు తెలపాలని జాన్విని, చిత్ర యూనిట్ ని వారు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఒక్కరు కూడా తమ నిరసనకు సపోర్ట్ తెలపలేదని వారు ఆగ్రహంగా పేర్కొన్నారు. దీంతో నటితో బాటు చిత్ర బృందమంతా.. తాము సపోర్ట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఆ తరువాతే అన్నదాతలంతా అక్కడి నుంచి కదిలారు. అనంతరం జాన్వీ కపూర్ తన ఇన్స్ టా గ్రామ్ లో ఓ స్టేట్ మెంట్ ఇస్తూ.. ఈ దేశానికి అన్నదాతలే ఆధారమని, మనకు ఆహారాన్ని అందిస్తున్న వారి సమస్య తీరేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. రైతులకు అనుకూలంగా మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నానన్నారు. జాన్వీ నటిస్తున్న గుడ్ లక్ జెర్రీ మూవీకి ఆనంద్ ఎల్ .రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఒక మూవీ షూటింగ్ ని అడ్డుకుని అన్నదాతలు ఇలా తమ డిమాండును చిత్ర యూనిట్ కి తెలపడం, అందుకు సిబ్బంది కూడా అంగీకరించడం ఇదే మొదటిసారి.