ఆయనపై.. దుష్ప్రచారం నేను చేయలేదు: నటుడు వెంకట్

Actor Fish Venkat lodges complaint against fake news on YS Jagan, ఆయనపై.. దుష్ప్రచారం నేను చేయలేదు: నటుడు వెంకట్

ప్రముఖ తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్.. అందరికీ సుపరిచితమే. ఒక పక్క విలన్‌గా సీరియస్‌గా యాక్ట్ చేస్తూ.. మరోపక్క జోకులతో నవ్వులు పండిస్తూంటాడు. తన అయోమయ మాటలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు ప్రేక్షకులు. అలాగే.. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు వీరాభిమాని. జగన్‌ పాదయాత్రలో కూడా వెంకట్ పాలు పంచుకున్నాడు. అయితే.. వెంకట్ ఘాటు వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు.

అలాంటి ఫిష్ వెంకట్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఏపీ సీఎం జగన్‌పై హాట్‌ హాట్‌గా.. ఘాటుగా ఫేస్‌బుక్‌లో విమర్శలు చేశారు. జగన్ బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం.. ఏపీ రాజకీయాల్లో కీలకంగా నిలిచింది. మీరు చంపారంటే.. మీరు చంపారని.. వైసీపీ, టీడీపీ పార్టీలు విమర్శలు చేసుకున్నారు. దీనిపై అప్పటి సీఎం.. చంద్రబాబు కూడా విచారణ జరిపి సిట్ వేయించారు. అనంతరం ఎన్నికల తర్వాత.. సీఎంగా జగన్ నియమితులై.. వివేకానందరెడ్డి మృతిపై మరో సిట్‌ని వేశారు. రోజులు గడుస్తున్నా.. విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు.. దీనిపై వెంకట్ వార్తల్లో నిలిచారు.

కాగా.. వెంకట్ ఫేస్‌బుక్‌లో.. వివేకానందరెడ్డి మృతిపై ఘాటు విమర్శలు చేశారు. కొద్ది నిమిషాల్లోనే.. ఈ వార్త వైరల్ కావడంతో.. నెటిజన్లు వెంకట్‌ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయం వెంకట్ వరకూ చేరండంతో.. అలా చేసింది నేను కాదని.. నా పేరుతో ఫేక్ అకౌంట్ ఏర్పాటు చేసి.. ఇలా కామెంట్స్ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు నటుడు వెంకట్. దీనిపై స్పందించిన పోలీసులు.. త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే.. గుంటూరుకు చెందిన కొందరు వ్యక్తులు కూడా.. సీఎం జగన్‌ను దుర్భాషలాడుతూ.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీన్ని ఏపీ పోలీసులు సీరియస్‌గా తీసుకుని..వారిని అరెస్ట్.. చేసి శిక్ష విధించారు.

Actor Fish Venkat lodges complaint against fake news on YS Jagan, ఆయనపై.. దుష్ప్రచారం నేను చేయలేదు: నటుడు వెంకట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *