పిట్టగూటి సాక్షిగా హీరో దర్శన్‌ దంపతుల వివాదం..!

Actro Darshan Couple

ఇటీవల ప్రముఖ నటుడు దర్శన్‌, ఆయన భార్య విజయలక్ష్మీ మధ్య వివాదం తారస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. సోమవారం ట్విట్టర్‌లో ఇద్దరు ఒకరినొకరు అన్‌ ఫాలో అయ్యారు. విజయలక్ష్మీ దర్శన్‌ పేరుతో ఉన్నట్విట్టర్‌లో ఖాతా నుంచి దర్శన్‌ అనే పదాన్ని తొలగించడంతో వీరివురు మళ్లీ గొడవలు పడుతున్నారంటూ నెటింట్లో పుకర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వదంతులు నమ్మొద్దని ఆ వెంటనే విజయలక్ష్మి ట్వీట్‌ చేశారు. కానీ ఇద్దరి మధ్య ఏదో వివాదం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. కాగా గతంలో వీరిద్దరి మధ్య తగాదాలు తీవ్రరూపం దాల్చడం కూడా తెలిసిందే. మరోవైపు కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నట్లుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే విజయలక్ష్మీ, దర్శన్‌ల మధ్య వివాదాలు కొనసాగుతన్నాయనడానికి దారి తీస్తోంది. ఇదిలా ఉంటే వీరి మధ్య సంధి చేకూర్చేందుకు గానూ ఓ నటుడు, రాజకీయనాయకడు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *