వీళ్ళే నిరసనకారులు.. ఆచూకీ చెప్పండి.. యూపీ పోలీసుల వెరైటీ ప్రచారం

సవరించిన పౌరసత్వ చట్టానికి నిరసనగా తమపై రాళ్లు రువ్విన, గన్స్ ఝళిపించిన సుమారు 110 మంది ఆందోళనకారుల ఫోటోలను యూపీ పోలీసులు రిలీజ్ చేశారు. కాన్పూర్, ఫిరోజాబాద్, మావూలలో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే.. ఆ సందర్భంగా వీరంతా ఖాకీలపై రెచ్చి పోయారు. వీరి రాళ్లదాడిలో [పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గోరఖ్ పూర్ లో నిరసనలకు దిగినవారి ఆస్తులను జప్తు చేస్తామని వారికి నోటీసులు పంపారు. బిజ్నూర్ లో ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సమాచారం […]

వీళ్ళే నిరసనకారులు.. ఆచూకీ చెప్పండి.. యూపీ పోలీసుల వెరైటీ ప్రచారం
Follow us

|

Updated on: Dec 26, 2019 | 2:18 PM

సవరించిన పౌరసత్వ చట్టానికి నిరసనగా తమపై రాళ్లు రువ్విన, గన్స్ ఝళిపించిన సుమారు 110 మంది ఆందోళనకారుల ఫోటోలను యూపీ పోలీసులు రిలీజ్ చేశారు. కాన్పూర్, ఫిరోజాబాద్, మావూలలో ఇటీవల పెద్దఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే.. ఆ సందర్భంగా వీరంతా ఖాకీలపై రెచ్చి పోయారు. వీరి రాళ్లదాడిలో [పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గోరఖ్ పూర్ లో నిరసనలకు దిగినవారి ఆస్తులను జప్తు చేస్తామని వారికి నోటీసులు పంపారు. బిజ్నూర్ లో ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలియజేసేవారికి రూ. 25 వేల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఫిరోజాబాద్, గోరఖ్ పూర్ పోలీసులు తమ ‘ వాంటెడ్ లిస్ట్ ‘ లో ఉన్న వ్యక్తుల ఫోటోలను వాట్సాప్, ఫేస్ బుక్ లలో సర్క్యులేట్ చేశారు. కొన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ పోస్టర్స్ అంటించారు. వీరి ఆచూకీ తెలిపేవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని. అలాగే తాము కూడా వీరి వివరాలను ఎవరికీ తెలియజేయబోమని వారు పేర్కొన్నారు. యూపీలో జరిగిన ఘర్షణలు, అల్లర్లలో సుమారు 19 మంది మరణించారు. పోలీసులు ఇప్పటివరకు 213 కేసులు నమోదు చేసి దాదాపు వెయ్యిమందిని అరెస్ట్ చేశారు. మావులో గత సోమవారం అనేకమంది ఆందోళనకారులు ఖాకీలపై రాళ్లు రువ్వడమే గాక.. కొన్ని వాహనాలను కూడా తగులబెట్టారు. కాగా-కాన్పూర్ పోలీసులు 48 మంది ఫోటోలను, ఫిరోజాబాద్ ఖాకీలు 80 మంది ఫోటోలను రిలీజ్ చేశారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు