హీరో రామ్ ఎవరో నాకు తెలీదు: ఏసీపీ సూర్యచంద్ర రావు

విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ సూర్యచంద్రరావు మాట్లాడారు.

హీరో రామ్ ఎవరో నాకు తెలీదు: ఏసీపీ సూర్యచంద్ర రావు
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 6:23 PM

ACP Suryachandra Rao: విజయవాడలోని స్వర్ణా ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ సూర్యచంద్రరావు మాట్లాడారు. రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ బాబు ఇంకా పరారీలో ఉన్నాడని ఆయన అన్నారు. రమేష్ ఇల్లు, ఆఫీసులో సోదాలు నిర్వహించామని, అతడు పోలీసుల ముందుకు వచ్చి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో చూపిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని ఏసీపీ స్పష్టం చేశారు. సాక్ష్యులందరినీ విచారిస్తున్నామని, ముద్దాయిల కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. స్వర్ణా ప్యాలెస్‌లో ఉన్నది రమేష్ హాస్పిటల్ రోగులు కాబట్టి రమేష్ ఆసుపత్రి మాత్రమే దీనికి బాధ్యత వహించాలని ఆయన సూచించారు. డాక్టర్ మమత దగ్గర కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నామని ఏసీపీ స్పష్టం చేశారు.

ఇక హీరో రామ్ కామెంట్లపై స్పందించిన సూర్యచంద్రరావు ఆయనెవరో తనకు తెలీదని అన్నారు. ప్రభుత్వం కొన్ని హోటళ్లని క్వారంటైన్ సెంటర్లకు అనుమతిని ఇచ్చిందని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ల కోసం హోటళ్లలో ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసిందని అన్నారు. క్వారంటైన్ సెంటర్‌లు వేరు, కోవిడ్ సెంటర్‌లు వేరు అని తెలుసుకోవాలని సూర్య చంద్రరావు స్పష్టం చేశారు. కాగా స్వర్ణా ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన రమేష్ ఆసుపత్రి యజమాని శ్రీనివాసరావు, సిబ్బంది పరారీలో ఉండగా.. వారి ఆచూకీ కోసం ఎనిమిది ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read More:

చంద్రుడిపై బిలం.. ‘విక్రమ్ సారాభాయ్’‌ పేరును పెట్టిన నాసా

క్షీణించిన మంత్రి, మాజీ క్రికెటర్‌ చేతన్ చౌహాన్ ఆరోగ్యం

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..