జగన్‌పై దాడి చేయలేదు..అదో యాక్సిడెంటల్ ఇన్సిడెంట్

జగన్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ విడుదలయ్యాడు. ఏడు నెలల రిమాండ్ అనంతరం అతను బెయిల్‌పై రిలీజయ్యాడు. ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న శ్రీనివాస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, అతనికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్ NIA కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు… కొంత పూచీకత్తుతో గురువారం బెయిల్ ఇచ్చింది. ఐతే… ఈ బెయిల్ ఆర్డర్ వెంటనే జైలు అధికారులకు చేరలేదు. శుక్రవారం సాయంత్రం అది చేరింది. అందువల్ల అతన్ని ఇవాళ […]

జగన్‌పై దాడి చేయలేదు..అదో యాక్సిడెంటల్ ఇన్సిడెంట్
Follow us

|

Updated on: May 25, 2019 | 10:12 AM

జగన్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ బెయిల్ విడుదలయ్యాడు. ఏడు నెలల రిమాండ్ అనంతరం అతను బెయిల్‌పై రిలీజయ్యాడు. ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్న శ్రీనివాస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడనీ, అతనికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్ NIA కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు… కొంత పూచీకత్తుతో గురువారం బెయిల్ ఇచ్చింది. ఐతే… ఈ బెయిల్ ఆర్డర్ వెంటనే జైలు అధికారులకు చేరలేదు. శుక్రవారం సాయంత్రం అది చేరింది. అందువల్ల అతన్ని ఇవాళ విడదల చేశారు. అయితే తానేమి జగన్‌పై దాడి చేయలేదని..కుక్ కావడం వల్ల తన దగ్గర ఉన్న కత్తి అనుకోకుండా జగన్‌కి గుచ్చుకుందని చెప్పుకొచ్చాడు. యువకులు అందరూ జగన్‌ను అన్నలా భావిస్తున్నారని..నేను అలాగే భావించి..ప్రజల సమస్యలకు సంబంధించి లెటర్ రాసి జగన్‌కి ఇవ్వాలనుకున్నానని చెప్పాడు. ‘జగన్‌కి ఏం తగిలిందో కూడా నాకు తెలీదని.. ఈ విషయంలో తాను నార్కో టెస్టుకి కూడా రెడీ’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ తాను తప్పని తేలితే శిరఛ్చేదనానికి కూడా రెడీ అన్నాడు. సింపతీ కోసం దాడి చేశానని వస్తున్న మాటల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు.