ACB Raids Tada Checkpost: నెల్లూరు జిల్లాలో తడ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారుల మెరుపు దాడి.. అక్రమ వసూళ్లు చేస్తున్నారని గుర్తింపు

నెల్లూరు జిల్లాలోని రవాణాశాఖ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. తడ మండలం బీవీ పాలెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ పై తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో నెల్లూరు జిల్లా ఏసీబీ అధికారులు మారువేషంలో..

ACB Raids Tada Checkpost:  నెల్లూరు జిల్లాలో తడ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారుల మెరుపు దాడి.. అక్రమ వసూళ్లు చేస్తున్నారని గుర్తింపు
Follow us

|

Updated on: Jan 28, 2021 | 2:14 PM

ACB Raids Tada Checkpost: నెల్లూరు జిల్లాలోని రవాణాశాఖ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. తడ మండలం బీవీ పాలెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ పై తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో నెల్లూరు జిల్లా ఏసీబీ అధికారులు మారువేషంలో దాడులను నిర్వహించారు. లుంగీ ధరించి, రుమాళ్లు చుట్టుకొని లారీ డ్రైవర్ వేషంలో RTO ఆఫీసుపై ఆకస్మిక దాడులు చేశారు.

చెక్ పోస్ట్ వద్దకు ఏసీబీ అధికారులు రాగానే ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారులవద్ద ఇద్దరు ప్రవేటు వ్యక్తులు..వాహనదారుల వద్ద అదనంగా వసూళ్లు చేస్తున్న వ్యక్తులు పరారయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారంలో నిందితుడు చెక్ పోస్ట్ అధికారుల అనుమతితో ప్రైవేటు వ్యక్తుల ద్వారా అక్రమ వసూళ్లు చేయిస్తున్నారని చెప్పడంతో ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారుల ఫైల్ ను అధికారులు పరిశీలించారు. మొత్తం 90వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూళ్లు చేయగా ఫైల్స్ లో మాత్రం రూ 79 వేలు నమోదయ్యి ఉంది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఫైన్ 79 వేలు కాగా.. మిగిలిన పదకొండువేల నూటఇరవై రూపాయలను వాహనదారుల నుంచి అక్రమంగా వసూళ్లు చేసినట్లు ఏసీబీ అధికారులుగుర్తించారు.

ఈ చెక్‌పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి మూడేళ్లయిందట. అక్కడ సిబ్బంది అక్రమ వసూళ్లు చేస్తున్నారని తెలుస్తోంది. చెక్‌పోస్ట్‌లో అక్రమాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. సిబ్బంది వాటిని పక్కకు మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్రమవసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి నివేదికను ఏసీబీ అధికారులు ఇస్తామని చెప్పారు.

Also Read: ఆ దేశంలో ఆగని కరోనా కల్లోలం.. మార్చి 8 వరకూ స్కూల్స్ బంద్ .. విద్యార్థులకు రోజూ ఆహార ప్యాకెట్లు పంపిణీ