ఓర్వకల్లు ఆర్‌ఐ ఇంటిపై ఏసీబీ సోదాలు

కర్నూలు జిల్లా ఓర్వకల్లు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేపట్టారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరాల సంజీవరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో.. కోర్టు సర్చ్ వారెంట్ తో ఏసిబీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఆర్.ఐ నివాసం ఉంటున్న కర్నూలు లోని ధనలక్ష్మి నగర్ లో సోదాలు చెయ్యగా ఎస్.బి.ఐ లాకర్ కీ , ధనలక్ష్మి నగర్ లోనే 16 లక్షల స్థలం, కొత్తపల్లి గ్రామంలో అగ్రికల్చర్ […]

ఓర్వకల్లు ఆర్‌ఐ ఇంటిపై ఏసీబీ సోదాలు
Follow us

|

Updated on: Sep 23, 2019 | 6:02 PM

కర్నూలు జిల్లా ఓర్వకల్లు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేపట్టారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరాల సంజీవరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో.. కోర్టు సర్చ్ వారెంట్ తో ఏసిబీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఆర్.ఐ నివాసం ఉంటున్న కర్నూలు లోని ధనలక్ష్మి నగర్ లో సోదాలు చెయ్యగా ఎస్.బి.ఐ లాకర్ కీ , ధనలక్ష్మి నగర్ లోనే 16 లక్షల స్థలం, కొత్తపల్లి గ్రామంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరా 4 సెంట్లు డాక్యుమెంట్స్ లభించాయి.. అలాగే అతని అత్త మామ ఊరు అయిన మోత్కూర్ లో సోదాలు కొనసాగిస్తున్నారు.. పసుపల గ్రామ పంచాయతీ లో ఒక హౌస్ సైట్  తో పాటు  ఒక కోటి 50 లక్షలు విలువ చేసే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.