బెట్టింగ్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి సీఐ జగదీష్ అవినీతి కేసులో డీఎస్పీకి కూడా వాటా.!

ప్రజలకి సాయం చేయండని సర్కారీ నౌకరీలిచ్చి.. అదే మంది సొమ్మును నెల నెలా పెద్దమొత్తాల్లో జీతాలుగా ఇస్తున్నా, కొందరు ఖాకీలకు బుద్ధి సరిగా ఉండటంలేదు. ఎన్నో అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని మొత్తం వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్నే ఊడగొడుతున్నారు. తాజాగా నిజామాబాద్‌ పరిధిలో వెలుగుచూసిన ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ అవినీతి కేసులో కొత్త కోణం వెలుగు లోకి వచ్చింది. ఈ […]

  • Venkata Narayana
  • Publish Date - 7:14 pm, Sat, 21 November 20

ప్రజలకి సాయం చేయండని సర్కారీ నౌకరీలిచ్చి.. అదే మంది సొమ్మును నెల నెలా పెద్దమొత్తాల్లో జీతాలుగా ఇస్తున్నా, కొందరు ఖాకీలకు బుద్ధి సరిగా ఉండటంలేదు. ఎన్నో అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని మొత్తం వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్నే ఊడగొడుతున్నారు. తాజాగా నిజామాబాద్‌ పరిధిలో వెలుగుచూసిన ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ అవినీతి కేసులో కొత్త కోణం వెలుగు లోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే.. కామారెడ్డి డి.ఎస్.పి లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. దీంతో డీఎస్పీ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేసి.. పోలీసు అతిథి గృహంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను విచారణ జరుపుతున్నారు. ఇదీ.. సంగతీ. !