బ్రేకింగ్: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్…

ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఏసీబీ రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టింది. ఇక ఈ స్కాం వెనుక టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. టెలీహెల్త్ సర్వీసుల […]

బ్రేకింగ్: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్...
Follow us

|

Updated on: Jun 12, 2020 | 9:35 AM

ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఏసీబీ రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టింది. ఇక ఈ స్కాం వెనుక టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. టెలీహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. అలాగే నామినేషన్ల పద్ధతిలో టెండర్లును కేటాయించాలంటూ అచ్చెన్నాయుడు ఆదేశించినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. దీనితో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ కోర్టుకు తరలిస్తున్నారు.

కాగా, ఏపీ ఈఎస్ఐలో దాదాపు 151 కోట్ల అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని అచ్చెన్నాయుడు ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. రూ. 988 కోట్ల కొనుగోళ్లలో ఆయన పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 2014-19 మధ్య భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో తేలింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంటాక్టర్ల లబ్ది కోసం అవసరం లేకపోయినా మందులు కొనుగోలు చేసినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం తతంగాన్ని ఇద్దరు ఈఎస్ఐ అధికారులు నడిపినట్లు తెలుస్తోంది. రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు సుమారు రూ.51 కోట్లు చెల్లించినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. అలాగే మందులు పరికరాల వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా సంస్థలు టెండర్లు చూపించినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. కాగా, ఈ స్కాంలో ఇప్పటికే ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు.