3 రోజుల ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు..!

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని 3 రోజులపాటు అవినీతి నిరోధ‌క శాఖ‌ అధికారుల కస్టడీకి అనిశా స్పెష‌ల్ కోర్టు అనుమతించింది. మూడ్రోజులపాటు అచ్చెన్నాయుడిని హాస్పిటిల్ లోనే విచారించాలని ఆదేశించింది.

3 రోజుల ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 10:05 AM

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని 3 రోజులపాటు అవినీతి నిరోధ‌క శాఖ‌ అధికారుల కస్టడీకి అనిశా స్పెష‌ల్ కోర్టు అనుమతించింది. మూడ్రోజులపాటు అచ్చెన్నాయుడిని హాస్పిటిల్ లోనే విచారించాలని ఆదేశించింది. అచ్చెన్నాయుడితో పాటు ఇదే కేసులో ఎ1గా ఉన్న రమేష్‌ కుమార్‌నూ అధికారులు ఇన్వెస్టిగేట్ చేయనున్నారు. ఈఎస్​ఐ అవకవతకల కేసులో మాజీ మిన‌స్టర్ అచ్చెన్నాయుడు కొన్ని రోజుల కిందట అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్యాప్తు చేపట్టిన అనిశా కోర్టు.. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్య కార‌ణాలు దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించాలని సూచించింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్​లో మాజీ మినిస్ట‌ర్ చికిత్స పొందుతున్నారు. తాజా కస్టడీకి అనిశా కస్టడీకి అధికారులు ప‌ర్మిష‌న్ కోరగా..మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే విచారించాలని కోర్టు అనుమంతించింది .