చంద్రబాబుకు షాక్! అక్రమ ఆస్తుల కేసు విచారణకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి సోమవారం ఉత్త్తర్వులు జారీ చేశారు. లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని […]

చంద్రబాబుకు షాక్! అక్రమ ఆస్తుల కేసు విచారణకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!
Follow us

| Edited By:

Updated on: Nov 19, 2019 | 12:21 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి సోమవారం ఉత్త్తర్వులు జారీ చేశారు. లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును ఈ నెల 25 వ తేదీకి వాయిదా వేశారు. అయితే కేసు విచారణ ప్రారంభంకాక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత బాబు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు.

సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసులో స్టే గడువు ముగిసినా… దాన్ని పొడిగించాల్సిందిగా చంద్రబాబు కోరలేదు. నెక్ట్స్ ఉత్తర్వులు వచ్చే వరకూ… 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందని చంద్రబాబు తరపు లాయర్ వాదించారు. 2005 మార్చి 14న ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రస్తుత జడ్జి పరిశీలించారు. స్టే గడువు ముగిసినందున ఇప్పుడు వాదనలు వినిపించేందుకు వీలు లేదని అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వుల్ని లెక్క లోకి తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు కేసు విచారణ కొనసాగనుంది.