చిత్తూరులో మరో అవినీతి వీఆర్వో.. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్‏హ్యండెడ్‏గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

చిత్తూరులో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ అవినీతి వీఆర్వో. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన వీఆర్వో గంగాద్రి రామకృష్ణ అనే రైతు

చిత్తూరులో మరో అవినీతి వీఆర్వో.. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్‏హ్యండెడ్‏గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Follow us

|

Updated on: Dec 05, 2020 | 5:04 PM

Chittoor: చిత్తూరులో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ అవినీతి వీఆర్వో. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన వీఆర్వో గంగాద్రి, రామకృష్ణ అనే రైతు భూమిని ఆన్‏లైన్‏లో నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. లక్ష రూపాయాలు లంచం ఇస్తేనే రామకృష్ణ భూమిని ఆన్‏లైన్‏లో నమోదు చేస్తానని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక ఆ రైతు రూ.లక్ష లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఓటి దుకాణం దగ్గర లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వో గంగాద్రి నుంచి లక్ష రూపాయాలు స్వాధినం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.