Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

మోదీ యాత్రపై ప్రచారార్భాటం.. కోడ్ ఉల్లంఘనే: దీదీ

PMs Kedarnath trip violates code, మోదీ యాత్రపై ప్రచారార్భాటం.. కోడ్ ఉల్లంఘనే: దీదీ

ప్రధాని నరేంద్రమోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్ పర్యటనలపై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారార్భాటాన్ని దీదీ ఖండించారు. ఇది కూడా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆరోపిస్తూ.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. చివరి దశ ఎన్నికలు ఇంకా జరుగుతుండగా.. మోదీ పర్యటనలు చేస్తున్నారని.. ఆయన టూర్లను దేశవ్యాప్తంగా అన్ని ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయని.. దీని వలన ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక మాస్టర్ ప్లాన్‌తోనే మోదీ ఈ టూర్లను చేపట్టారని ఆమె దుయ్యబట్టారు.

ఇండియా వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కళ్లు, చెవులుగా వ్యవహరించాల్సిన ఈసీ.. ఇదంతా చూస్తూ ప్రేక్షకపాత్ర వహిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ చేపట్టాలనుకున్న హిమాలయాల పర్యటనకు ఈసీ అనుమతినిచ్చింది. అయితే ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన పర్యటన ఉండాలని సూచించింది.