ఢిల్లీ ఓటింగ్‌పై కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్.. ఈవీఎంలపై అనుమానం..

ఢిల్లీ ఎన్నికలపై సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపణలు చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద కాపలగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించడంపై.. అరవింద్ కేజ్రీవాల్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ శాతాన్ని ఆదివారం సాయంత్రం […]

ఢిల్లీ ఓటింగ్‌పై కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్.. ఈవీఎంలపై అనుమానం..
Follow us

| Edited By:

Updated on: Feb 09, 2020 | 9:27 PM

ఢిల్లీ ఎన్నికలపై సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే కుట్ర జరుగుతుందంటూ ఆరోపణలు చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద కాపలగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించడంపై.. అరవింద్ కేజ్రీవాల్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదని ఈసీ స్పష్టం చేసింది.

మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ శాతాన్ని ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఒకటికి రెండు సార్లు పోలింగ్ శాతాన్ని పరిశీలించడం వల్లే.. ప్రకటించడానికి ఆలస్యమైందని ఈసీ పేర్కొంది. మొత్తం 62.59 శాతం ఓటింగ్‌ నమోదైందని.. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు రెండు శాతం పెరిగిందన్నారు.