టాప్‌ రేటింగ్‌లో అభినందన్, మోండాల్.. గూగుల్ సెర్చ్‌లో నెంబర్ వన్

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లి.. ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తి. అయితే.. ఇప్పుడు ఆయన గురించి మళ్లీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అభినందన్ వర్థమాన్ మళ్లీ నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచాడు. ఎక్కడా అని అనుకుంటున్నారా..? గూగుల్ సెర్చ్‌లో.. అతని క్రేజ్ ఇంకా తగ్గిపోలేదు. 2019 సంవత్సరంలో.. గూగుల్లో.. నెటిజన్స్‌ అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు అభినందన్‌ వర్థమాన్. మార్చి నెలలో.. బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం […]

టాప్‌ రేటింగ్‌లో అభినందన్, మోండాల్.. గూగుల్ సెర్చ్‌లో నెంబర్ వన్
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 6:32 PM

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లి.. ప్రాణాలతో తిరిగొచ్చిన వ్యక్తి. అయితే.. ఇప్పుడు ఆయన గురించి మళ్లీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అభినందన్ వర్థమాన్ మళ్లీ నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచాడు. ఎక్కడా అని అనుకుంటున్నారా..? గూగుల్ సెర్చ్‌లో.. అతని క్రేజ్ ఇంకా తగ్గిపోలేదు. 2019 సంవత్సరంలో.. గూగుల్లో.. నెటిజన్స్‌ అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు అభినందన్‌ వర్థమాన్.

మార్చి నెలలో.. బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం జరిగిన వైమానిక దాడుల్లో.. పాక్ యుద్ధ విమానాన్ని వీరోచితంగా తరిమికొట్టే ప్రయత్నంలో.. అభినందన్ పాక్ సైనికులకు దొరికిపోయారు. అప్పట్లో.. ఈ వార్త పెద్ద దుమారాన్ని లేపింది. ఈ ఘటనతో.. అభినందన్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. దీంతో.. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అనే పేరు ట్రెండింగ్‌గా మారింది. ఈ ఘటన అనంతరం కూడా.. గూగుల్ సెర్చ్‌లో అభినందన్ పేరును సెర్చ్ చేయని వారు లేరు.

ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన.. లిస్ట్ తీసింది ఈ సంస్థ. ఈ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో.. అభినందన్ ఉండగా.. రెండో స్థానంలో ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ఉన్నారు. ఇక టాప్ 3లో యువరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే.. ఇటీవలే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గాయని రాణు మోండాల్ 7వ స్థానంలో.. టాప్‌ 10లో చోటు దక్కించుకున్నారు.

టాప్ 10 లిస్ట్:

1. అభినందన్ వర్థమాన్ 2. లతా మంగేష్కర్ 3. యువరాజ్ సింగ్ 4. ఆనంద్ కుమార్ 5. విక్కీ కౌషల్ 6. రిషబ్ పంత్ 7. రాణు మోండల్ 8. తార సుతారియా 9. సిద్ధార్థ శుక్లా 10. కొయినా మిత్రా