Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

నిన్నటి దాకా విమర్శలు.. మోదీని కల్సాక ప్రశంసలు..ఏంజరిగిందంటే ?

abijith met pm modi, నిన్నటి దాకా విమర్శలు.. మోదీని కల్సాక ప్రశంసలు..ఏంజరిగిందంటే ?

నిన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీని, ఆయన ప్రభుత్వ ఆర్థిక విధానాలను తెగ విమర్శించిన నోబెట్ ప్రైజ్ విన్నర్, ఆర్తిక వేత్త అభిజిత్ బెనర్జీ.. మంగళవారం ఉన్నట్లుండి మాట మార్చారు. ప్రదాని మోదీ ఓ విజనరీ కలిగిన పాలకుడని, బ్యూరోక్రసీలో ఆయన తేవాలనుకుంటున్న మార్పులు మొత్తం దేశ గతినే మార్చేస్తాయని ప్రశంసల జల్లు కురిపించారు.

కునారిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చర్యలేవీ తీసుకోవడం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం దాదాపు అసాధ్యమని నిన్నటి వరకు పలు సందర్భాలలో మాట్లాడారు అభిజిత్ బెనర్జీ.. మంగళవారం ప్రధానితో జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత బెనర్జీ మాటలో మార్పు కనిపించింది.

abijith met pm modi, నిన్నటి దాకా విమర్శలు.. మోదీని కల్సాక ప్రశంసలు..ఏంజరిగిందంటే ?

మంగళవారం భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా… బెనర్జీ మీడియాతో మాట్లాడారు. “నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. మానవ సాధికారత పట్ల ఆయనకున్న మక్కువ స్పష్టంగా కనిపించింది” అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

abijith met pm modi, నిన్నటి దాకా విమర్శలు.. మోదీని కల్సాక ప్రశంసలు..ఏంజరిగిందంటే ?

మేము ఈ భేటీలో వివిధ విషయాలపై ఆరోగ్యకరమైన మరియు విస్తృతమైన చర్చలు జరిపాం. ఆయన సాధించిన విజయాలకు భారతదేశం గర్వపడుతుంది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అంటూ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన అభిజిత్ బెనర్జీ.. ప్రధాని మోదీ చక్కని దృక్పథం వున్న వ్యక్తీ అంటూ కితాబునిచ్చారు. మోదీ చర్యలు భారత దేశ పురోగతికి దోహదపడతాయని వ్యాఖ్యానించారు బెనర్జీ.

 

Related Tags