పాక్ క్రికెట్ లెజండ్ హఠాన్మరణం

Abdul Qadir: Former Pakistan leg-spinner dies aged 63, పాక్ క్రికెట్ లెజండ్ హఠాన్మరణం

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్ దిగ్గజం అబ్దుల్ ఖాదిర్(63) హఠాన్మరణం చెందారు. తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. 1977-90 మధ్యలో పాక్ తరఫున 67టెస్టులు ఆడిన ఖాదిర్ 236 వికెట్లు పడగొట్టాడు. 1993 వరకు సాగిన 104 వన్డేల కెరీర్‌లో ఆయన 132 వికెట్లు తీశాడు. 80వ దశకంలో తన మణికట్టు మాయాజలంతో ఖాదిర్ పాక్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. ఇక లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖాదిర్ గుగ్లీకి కూడా ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చాడు.

ఇక 1987లో ఇంగ్లండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో ఖాదిర్ 56 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. పాక్ తరఫున ఇప్పటికీ ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. ఇక ఆయన మార్గనిర్దేశంలోనే తరువాతి తరం లెగ్‌స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ రాటుదేలాడు. మరోవైపు ఖాదిర్ నలుగురు కుమారులు కూడా ఫస్ట్‌ క్లాస్‌ స్థాయిలో ఆడారు. వీరిలో లెగ్‌స్పిన్నర్ ఉస్మాన్ త్వరలో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం పాక్‌ జట్టుకు ఆడుతున్న ఉమర్ అక్మల్.. ఖాదిర్ అల్లుడు కావడం విశేషం. కాగా ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *