భారత్ v/s ఆస్ట్రేలియా : డీన్ జోన్స్‌ను వెనక్కి నెట్టి తన పేరిట రికార్డును నెలకొల్పిన ఆరోన్ ఫించ్..

సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆసిస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన రెండవ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

  • Shiva Prajapati
  • Publish Date - 8:31 pm, Fri, 27 November 20
భారత్ v/s ఆస్ట్రేలియా : డీన్ జోన్స్‌ను వెనక్కి నెట్టి తన పేరిట రికార్డును నెలకొల్పిన ఆరోన్ ఫించ్..

సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆసిస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన రెండవ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. శుక్రవారం నాడు భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఫించ్ 124 బంతులు ఆడి 114 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో ఫించ్ తన వన్డే కెరీర్‌లో 5వేల స్కోర్ మైలురాయిని దాటాడు. ఫించ్ కేవలం 126 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. కాగా, ఈ జాబితాలో తొలిస్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. కేవలం 115 ఇన్నింగ్స్‌లలోనే వార్నర్ 5వేల పరుగులను పూర్తి చేసిన ఆసిస్ ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నారు.

అయితే, ఫించ్ కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ 128 ఇన్నింగ్స్‌లలో 5వేల పరుగులు పూర్తి చేసి అతి తక్కువ సమయంలోనే 5వేల పరుగులు చేసిన రెండో ఆసిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పుడు ఫించ్ 126 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని దాటి డీన్ జోన్స్ పేరును వెనక్కి నెట్టారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆమ్లా పేరు మొదటి ప్లేస్‌లో ఉంది. 101 ఇన్నింగ్స్‌లలోనే ఆమ్లా 5వేల పరుగులను చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రగణ్యుడిగా నిలిచాడు.

Also Read :

భారత్ – ఆస్ట్రేలియా వన్డే.. టీమిండియాపై 17 ఏళ్ల నాటి రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఆసిస్ టీమ్..