బీజేపీ బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పిన ఆప్..! ఇక నుంచి..

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హ్యాట్రిక్ విజయం సాధించడంతో.. ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇదే జోష్ కొనసాగించేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆప్.. ఇసారి.. తన సత్తా చాటేందుకు మరోసారి ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇకపై దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆప్ సిద్ధమవుతోంది. ఈ […]

బీజేపీ బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పిన ఆప్..! ఇక నుంచి..
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 4:33 AM

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ హ్యాట్రిక్ విజయం సాధించడంతో.. ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇదే జోష్ కొనసాగించేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆప్.. ఇసారి.. తన సత్తా చాటేందుకు మరోసారి ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇకపై దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆప్ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు.

పంజాబ్‌తో పాటు ఇతర అసెంబ్లీ ఎన్నికలపైనా కేజ్రీవాల్‌ దృష్టి పెట్టనున్నారన్నారన్నారు. పార్టీని విస్తరించుకోవడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి వాలంటీర్లను సిద్ధంచేసుకోవడమే లక్ష్యం పెట్టుకున్నామని.. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ఖచ్చితంగా పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు.

ద్వేషం, విభజన రాజకీయం వంటి అంశాలతో బీజేపీ ప్రతికూల జాతీయవాదం అనుసరిస్తోందని.. కానీ ఆప్‌ మాత్రం ప్రేమ, గౌరవమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ సానుకూల జాతీయవాదాన్ని అనుసరిస్తోందన్నారు. ఢిల్లీలో ఆప్ చేసిన ప్రయోగం యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాయ్‌ అన్నారు.